కార్యకర్తల సంక్షేమమే టీడీపీ ధ్యేయం

– ఎమ్మెల్యే అమిలినేని

శెట్టూరు, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాజకీయాల కోసమే కాకుండా కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తోందని, అందులో భాగంగానే దేశంలో ఎక్కడా ఏ రాజకీయ పార్టీ తీసుకోలేని నిర్ణయాలతో ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. శెట్టూరు మండల కేంద్రంలో శనివారం జరిగిన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వం పొందిన ప్రతీ కార్యకర్తను పార్టీ ఆదుకుంటుందని తెలిపారు. ప్రతీ కార్యకర్త విధిగా 100 రూపాయలతో కట్టి సభ్యత్వం నమోదు చేసుకుంటే 5 లక్షల రూపాయల బీమా వర్తిస్తుందన్నారు. ఇదే కాకుండా కార్యకర్తకు పలు ప్రయోజనాలు ఉంటాయన్నారు.