సీఎంపై ‘సాక్షి’లో రాతలు హేయం!

– కుప్పం పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు

కుప్పం, మహానాడు: సీఎం చంద్రబాబు నాయుడుపై సాక్షి పేపర్‌లో ఇష్టానుసారంగా రాతలు రాస్తున్నారని ఆ రాతలను ఖండిస్తున్నామని స్థానిక టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జోకర్ లా సీఎం చంద్రబాబును పోలుస్తూ సాక్షి పేపర్ లో వార్తలు రాస్తున్నారన్నారు. అసత్య వార్తలు రాస్తున్న సాక్షి పేపర్ పై చర్యలు తీసుకోవాలని సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు స్టేషన్ ఎదుట సాక్షి పేపర్ ను తగలబెట్టి నిరసన తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలనే ఇలాంటి కుట్రలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నారన్నారు. మరోసారి సీఎం చంద్రబాబు పై తప్పుడు రాతలు రాస్తే, కుప్పంలో సాక్షి పేపర్ రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.