బాపట్లలో అశేష జనవాహినితో భారీ ర్యాలీ
విజయోత్సవ వేడుకలను తలపించిన నామినేషన్
కూటమి ప్రభంజనంతో అధికార పార్టీలో వణుకు
బాపట్ల, మహానాడు : బాపట్ల కూటమి అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ మంగళవారం నామినేషన్ సందర్భంగా పసుపు దండు కదంతొక్కింది. నామినేషన్‌కు ముందు భారీ ర్యాలీ జరిగింది. నియోజకవర్గంలో జగన్ పాలనలో విసిగిపోయి మార్పు కోరుకుంటున్న ప్రజానీకం ఈ భారీ ర్యాలీలో భాగస్వాములై అభిమానాన్ని చాటుకున్నారు. పల్లెల నుంచి వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. పిట్టలవానిపాలెం మండలంలోని అల్లూరు లక్ష్మీ నృసింహుని దేవాలయంలో పూజల అనంత రం వందలాది కార్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ ప్రారంభమైంది. ఆయా గ్రామాల నుంచి ఈ ర్యాలీలో పెద్దఎత్తున తరలిరావటంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
నియోజకవర్గ ప్రజలు మొత్తం రోడ్డేక్కారా అన్న విధంగా జాతీయ రహదారి మొత్తం పసుపుమయంగా మారింది. పిట్టలవానిపాలెం మండలంలోని చందోలు గ్రామంలో భగలాముఖి అమ్మవారి దివ్య ఆశీస్సులు అందుకున్న వర్మ అక్కడి నుంచి రెడ్డి పాలెం సెంటర్ కు రాగానే తెలుగు యువత అధ్యక్షుడు కలకోట కిషోర్ రెడ్డి, శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా ప్రజలు ఆయన వెంట సాగారు. తండోపతండాలుగా రావటంతో నామినేషన్ ఘట్టం విజ యోత్సవ వేడుకలను తలపించింది. అన్నం సతీష్ ప్రభాకర్ సహకారం, జనసేన పార్టీ నాయ కుల కోలాహలం, వర్మ మంచితనం, ప్రభుత్వంపై వ్యతిరేకత కలబోసి ఈ కార్యక్రమం విజయ వంతం కావటానికి కారణమయ్యాయి. నామినేషన్ అనంతరం వేగేశన నరేంద్రవర్మ మీడియా తో మాట్లాడుతూ జగన్ పాలనలో ఆంధ్రరాష్ట్రం అప్పుల పాలైందని విమర్శించారు. నియోజక వర్గంలో ఎక్కడా అభివృధ్ధి జరగలేదని, అంతా అవినీతిమయమైందని దుయ్యబట్టారు. తనను గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కోరారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.