కేరళ ‘శ్రీ పద్మనాభ స్వామి’ ఆలయంలో చోరీ

కేరళ: కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. స్వామివారి పూజకు వినియోగించే ‘ఉరులి’ అనే కంచు పాత్రను దుండగులు దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హరియాణాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు కేరళ పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన వైద్యుడని వెల్లడించారు. ఇతర నిందితులతో కలిసి గత వారం క్షేత్రాన్ని సందర్శించిన అనంతరం చోరీకి పాల్పడ్డాడని పేర్కొన్నారు.