అప్పుడు మీకు చట్టాలు గుర్తు రాలేదా?

-విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న ఫైర్

బుద్దా వెంకన్న మాట్లాడుతూ…వైసిపిలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్, విజయసాయి రెడ్డికి కనిపించలేదా?. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకు మీరు మురిసిపోయారు. లోకేష్ జూమ్ మీటింగ్ లోకి వస్తే వాళ్లకి తప్పు అని చెప్పలేదేం. దాడులు చేయవద్దని మా నాయకుడు ముందే చెప్పారు. ఎక్కడో ఏదో‌ ఒక‌ ఘటన జరిగితే విజయసాయి రెడ్డి రాద్దాంతం చేస్తున్నారు.

ఈ ఐదేళ్లల్లో నువ్వు, మీ జగన్ మీ వాళ్ల నోళ్లు ఎందుకు అదుపు చేయలేదు? ప్రభుత్వం పోగానే పిల్లి అరుపులు అరుస్తున్నారు. విజయసాయి రెడ్డి.. నువ్వు ఒక లుచ్చావి.. ఉత్తరాంధ్ర దోచేశావు. వీటి పై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నిజంగా మేము దాడులు చేయాలని అనుకుంటే… ఇలా ఉంటుందా పరిస్థితి. కక్ష సాధింపు రాజకీయాలు వద్దని మా అధినేత ప్రకటించారు.

జగన్ ఎప్పుడైనా ఇలా ఒక్క ప్రకటన చేశాడా? చంద్రబాబు ప్రమాణ స్వీకారం అద్భుతంగా జరిగింది. దానిని డైవర్ట్ చేయడానికే విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. సింహాలు, పులులు అన్న వాళ్లు… అధికారం పోగానే పిల్లులు అయిపోయారా. టిడిపి కార్యాలయంపై దాడి చేసిన దేవినేని అవినాష్ కి గన్ మెన్లు ఇచ్చారు. బూతులు తిట్టే నాని, వంశీలకి భద్రత పెంచారు. వల్లభనేని వంశీ మాత్రం మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు. వాడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు.. శిక్ష పడాల్సిందే. మీ వంశీతో నాకు ఫోన్ చేయించండి … నేను వాడితో మాట్లాడతా.

అధికార మదంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంట్లో‌వాళ్లను తిట్టించారు. అప్పుడు మీకు వాళ్ల బాధ తెలియలేదా… చట్టాలు గుర్తు రాలేదా? ఈ ఐదేళ్లల్లో మేము ధైర్యంగా పోరాడి నిలబడ్డాం. మా చంద్రబాబు సవాల్ చేసి, సిఎం అయ్యాక అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. మీ అవినీతి, అక్రమాల పై‌ విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. చంద్రబాబుకు ప్రతిపక్ష పాత్ర అయినా వచ్చింది… జగన్ కు అదీలేదు. మీకు సిగ్గు, శరం ఉంటే… వైసిపిని పూర్తిగా రద్దు చేయండి.

విజయసాయి రెడ్డి నీ మాయ మాటలు ఎవ్వరూ నమ్మరు. నువ్వు ముసలి నక్కవి, శకునివి… వదిలేది లేదు. వంశీని పిలిపించి పక్కన కూర్చో పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టు. మీ ఆగడాలను ఐదేళ్లు భరించాం… కేసులకు భయపడకుండా పోరాటాలు చేశాం. ఐదు రోజుల్లోనే ఫిర్యాదులు అంటూ హడావుడి చేస్తున్నారు. అధికార మదంతో అడ్డగోలుగా వాగిన వారు తప్పకుండా శిక్ష అనుభవించాలి అని అన్నారు.