– జెత్వాని లాయర్ నర్రా శ్రీనివాస్
అమరావతి: విజయవాడ పోలీసులు ముంబై నటి జెత్వాని స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. నాటి పోలీసులు, తనకు ఇబ్బందులకు గురి చేశారని జెత్వాని స్టేట్ మెంట్ ఇచ్చారు. జెత్వానిపై ఎక్కడా ఎటువంటి కేసులు లేవు. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వారి పై చర్యలు ఉంటాయి. 41ఏ నోటీసులు ఇవ్వాల్సిన కేసులో కుట్ర పూరితంగా వ్యవహరించారు. నటి జెత్వాని తల్లిదండ్రులనూ జైలులో పెట్టి బెయిల్ రాకుండా చేశారు. జెత్వానిపై ఫిర్యాదు చేసిన కుక్కల విద్యాసాగర్ చూపుతున్న అగ్రిమెంట్ కూడా కేసు పెట్టడం కోసం తయారు చేసిందే .