తెలంగాణకు విద్యా శాఖ మంత్రి కావలెను
బడిబాట మొదలైంది కానీ బడికి మంత్రి లేడు
బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ
విద్య సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.పుస్తకాల పైన పాత ముఖ్యమంత్రి, పాత విద్యాశాఖ మంత్రి పేర్లు ఉన్నాయి.విద్యార్థులు చూసి చెప్పే వరకు ఇవి బయటకు రాని పరిస్థితి.. పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందనడనికి ఇంతకంటే ఎం నిదర్శనం కావాలి.
విద్యా శాఖ ఒక దిక్కు దివాన లేని శాఖ లెక్క మారింది.విద్యాశాఖకు మంత్రి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు..కొత్త ప్రభుత్వం రాగానే మద్యం శాఖకు మంత్రిని పెట్టారు..విద్యాశాఖ కు మాత్రం మంత్రి పెట్టలేదు..సీఎం రేవంత్ రెడ్డికి విద్యాశాఖ కు ఎమ్ చేసాడు అంటే గాడిద గుడ్డు చేసాడు. ప్రతి జిల్లాకు DEO ఉండాలి.. కానీ 26 జిల్లాలకు DEO లు లేరు.
62 డెప్యూటీ EO పోస్టులకు ఒక్కరు కూడా డ్యూటీ లో లేరు.617 మండలకు MEO ఉండాలి కానీ.. కేవలం 17 మంది మాత్రమే MEO లు ఉన్నారు.598 మండలకు MEO లేరు.పాఠశాలలలో మరుగుదొడ్లు కడిగేందుకు స్కావెంజర్లు లేక దుర్వాసనతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల టీచర్ల పోస్టులు ఖాళీలు ఉంటే నోటిఫికేషన్ ఇచ్చింది 11వేలు మాత్రమే..
కాంగ్రెస్ లో గొడవలు ఉంటే పేదలు ఎందుకు ఇబ్బంది పడాలి.కాంగ్రెస్ లో విద్యాశాఖ నిర్వహించే అర్హులు ఎవరు లేరా..?విద్యాశాఖ ను పర్యవేక్షణ చేసే టైం సీఎం రేవంత్ రెడ్డి వద్ద లేకపోతే ఎందుకు దగ్గర పెట్టుకున్నారు..వెంటనే విద్యాశాఖ మంత్రి ని పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్వ శిక్ష అభియాన్ నిధులు పూర్తిగా వాడండి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించండి.