– ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు
చిలకలూరిపేట, మహానాడు: పుట్టినరోజు వేడుకలు జరుపుకొనే సంస్కృతి మా కుటుంబానికి లేదు.. ట్రాఫిక్ సమస్యలపై మాట్లాడడానికి వచ్చిన పోలీసులు వారు తిరిగి వెళ్ళే క్రమంలో మండల పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకల్లో అట్లా కనబడి వెళ్ళారు.. అంతేతప్ప తమ వేడుకల్లో బందోబస్తు రాలేదు అని పల్నాడు జిల్లా, చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఎవరో ఇద్దరి మధ్య సమస్య వస్తే ఎమ్మెల్యే పై రుద్దటం… ఎన్నారై టిడిపి… ఎన్నారైని… అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయటం… డబ్బులు రావాల్సి ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి… నాకు ఏమిటి సంబంధం? అని ఎమ్మెల్యే అన్నారు.
పరువు ప్రతిష్ఠకు భంగం కలిగింది కాబట్టే మీ ద్వారా వివరణ ఇస్తున్నానన్నారు. నా రాజకీయ చరిత్రలో ఎక్కడా అవినీతి మచ్చ లేదు… చంద్రబాబు ఆశయాలను చూసుకుంటూ ప్రజలనే అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నాను.. కష్టపడి పార్టీకి పనిచేసే వ్యక్తిని నేను.. తప్పు చేస్తే తప్పని ఒప్పుకునే మనిషిని నేను… చిలకలూరిపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని చరిత్ర చెబుతుందన్నారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి.