ధర్మవరంలో ధర్మం లేకుండా పోయింది

గుడ్‌ మార్నింగ్‌ అంటూ కనిపించినవి కబ్జా చేస్తున్నారు
కేతిరెడ్డి వంటి నాయకులు గెలిస్తే సర్వనాశనమే
హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి బి.కె.పార్థసారథి

ధర్మవరం, మహానాడు : ధర్మవరంలో ధర్మం లేకుండా పోయిందని, ఇందుకు కారణం కేతిరెడ్డి అరా చకాలేనని హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి బి.కె.పార్థసారథి ధ్వజమెత్తారు. ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూద న్‌రెడ్డి ఆధ్వర్యంలో జనసేన నాయకులతో సోమవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఉమ్మడి హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి బి.కె.పార్థసారథి, ధర్మ వరం అభ్యర్థి సత్యకుమార్‌ యాదవ్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. పార్థసా రథి మాట్లాడుతూ పేరుకే ధర్మవరం కానీ, ధర్మవరంలో ధర్మం లేకుండా పోయిందని దానికి కారణం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అని ఎద్దేవా చేశారు.

ప్రతిరోజు ఉదయం గుడ్‌ మార్నింగ్‌ పేరుతో ఎక్కడెక్కడో చూసుకుని అవి లాగేసుకుంటున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద కేసులు బనాయించి ఇబ్బం దులకు గురి చేస్తున్నారని అన్నారు. అందుకే ఆయనకు మరోసారి ఓటు వేస్తే రాష్ట్రం సర్వనాశనమవుతుందని విమర్శించారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాల న్నా, మన ప్రాంతం బాగుండాలన్నా, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే కూటమి ప్రభుత్వం రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా సత్యకు మార్‌కు కమలం గుర్తుకు, పార్లమెంట్‌ అభ్యర్థిగా సైకిల్‌ గుర్తుకు ఓట్లు వేసి వేయించి మెజార్టీతో గెలిపించాలని కోరారు.