-కుట్రపూరితంగా ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారం
-రైతులు ఎవరూ ఆందోళన చెంద వద్దు
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
-ఖరీఫ్ పంటలపై మంత్రి తుమ్మలతో చర్చలు
హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని రకాల పంటల విత్తనాల నిల్వలు ఉన్నాయని, విత్తనా ల కొరత లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వానాకాలం వ్యవసాయ సీజన్ ఖరీఫ్‌లో పండిరచాల్సిన పంటలపై ప్రభుత్వ సన్నద్ధతపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో గురువారం ఆయన చర్చించారు. బంజారాహిల్స్ మంత్రుల అధికారిక నివాసం లో ఈ చర్చలు జరిగాయి. చిన్నారెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల పంటల సాగు కోసం వేయాల్సిన విత్తనాలు సరిపడా ఉన్నాయని, విత్తనాల కొరతపై ప్రతిపక్ష పార్టీల నాయకులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జిల్లాల్లో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించే బాధ్యత ఆయా జిల్లాల కలె క్టర్లు, జిల్లాల వ్యవసాయాధికారులదేనని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించా లని సూచించారు. ఈ భేటీలో వ్యవసాయ అధికారుల సంఘం జేఏసీ చైర్మన్ బొమిరెడ్డి కృపాకర్‌రెడ్డి, రిటైర్డ్ వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.