దేశంలో యువతకు కొదవ లేదు… ఎన్నో విజయాలు సాధించగలరు

-క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయి
-సీఎం చంద్రబాబు సహకారంతోనే నేడు రాష్ట్రంలో గొప్ప క్రీడాకారులకు వెలుగులోకి వచ్చారు
-జాతీయ క్రీడా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-“టుడే నేషనల్ స్పోర్ట్స్ డే” ర్యాలీని ప్రారంభించిన మంత్రి
-ప్రతి ఓటమి గెలుపుకు మెట్టు…కష్టపడి కష్టపడితే తప్పకుండా ఉన్నట స్థాయికి చేరుకుంటారు..పి.వి. సింధు

విజయవాడ, ఆగస్టు,29: భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ప్రతిభావంతులైన ప్రతి క్రీడాకారుడికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని, సీఎం చంద్రబాబు నాయుడు పాలనలోనే క్రీడాకారులకు మంచి గుర్తింపు లభించిందని ప్రధానంగానే నేడు రాష్ట్రంలో ఎంతోమంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని, రాష్ట్ర వ్యాప్తంగా యువత ఎక్కువ గా ఉన్నారు వారందరూ క్రీడారంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తామని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొన్న రాష్ట్ర రవాణా,యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు.

ముందుగా ధ్యాన్చంద్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ ఓటమికి కంగిపోకుండా ఓటమిని మెట్టుగా చేసుకొని విజయ శిఖరాలు అవరోధించాలని, కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారని, ప్రతి ఒక్కరు క్రీడలు అలవాటు చేసుకోవాలని పి.వి.సింధు తెలిపారు. క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా క్రీడా విధానంలో ప్రతిపదలకు క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారికి తోడ్పాటు అందిస్తున్నామని శాప్ ఎండి తెలిపారు. కార్యక్రమానంతరం క్రీడాకారులకు స్పోర్ట్స్ కిడ్స్ ను అందజేశారు. మునిసిపల్ స్టేడియం నుండి పీవీపీ మాల్ వరకు నిర్వహించిన ర్యాలీని మంత్రి జండా ఊపి ప్రారంభించి “టుడే నేషనల్ స్పోర్ట్స్ డే” నినాదంతో ర్యాలీలో పాల్గొన్నారు.

మరో నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన మంత్రి
ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన నెల జీతం జీతాన్ని ₹3,16,000/- రూపాయలను పేద క్రీడాకారుల అవసరాలకు నిమిత్తం అందజేస్తున్నట్లుగా తెలిపారు. ఇదివరకే తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.