– కష్టపడి పని చేస్తే పదవులు వెతుక్కుంటూ వస్తాయనే దానికి దామచర్ల సత్య ఉదాహరణ
– మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి
– కొండపిలో అట్టహాసంగా దామచర్ల సత్య అభినందన సభ
కొండపి: తెలుగుదేశం పార్టీలో నిబద్ధతతో కష్టపడి పనిచేసే వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయనే దానికి దామచర్ల సత్య ఒక ఉదాహరణ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
ఆదివారం నాడు కొండపి సీతారామ కల్యాణ మండపంలో ఏపీ మ్యారిటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్యకు అభినందన సభ నిర్వహించారు. ముందుగా కొండపి మెయిన్ సెంటర్ నుంచి కళ్యాణ మండపం వరకు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ……తెలుగుదేశం పార్టీలో నిబద్ధతతో కష్టపడి పనిచేసే వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయనే దానికి దామచర్ల సత్య ఒక ఉదాహరణ అని అన్నారు.
సత్య ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వర్తి ఇస్తాడని అన్నారు. చిన్న వయసులోనే చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమన్నారు. సత్య కార్యకర్తలకు ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాచుకునేవాడన్నారు. ఆయన కార్యకర్తలను ఆదరించే విధానం పార్టీకి చేసిన సేవను గుర్తించి చంద్రబాబు నాయుడు మారి టైం బోర్డు చైర్మన్ గా అవకాశం కల్పించి సత్కరించారన్నారు.
ఏ నాయకుడికైనా పదవులు అలంకారం మాత్రమేనని ప్రజలకు చేసిన సేవే చరిత్రలో మిగిలిపోతుందన్నారు. చంద్రబాబు నాయుడుకు సత్య మీద పూర్తి నమ్మకం ఉందన్నారు. సత్య భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నటు మంత్రి తెలిపారు. గత ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని అన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసారని, 5 ఏళ్లలో ఒక్కరికీ కూడా ఒక్క రుణం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. తెలుగుదేశం పార్టీ 100 రోజుల పాలనలోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమానికి కొండపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.