Mahanaadu-Logo-PNG-Large

విపక్షం ఉండాలి.. జగన్ సభకు రావాలి

– ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్

అమరావతి: తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నట్టు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఎందుకంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. శాసనసభకు జగన్ రావాలని కోరుకుంటున్నానని, గతంలో చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత నేత పీజేఆర్‌ను ఇంటికి వెళ్లి కలిశారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాలని ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు.