ప్రజల్లో నమ్మకం పెంచేలా వైద్యసేవలు ఉండాలి

– ఎమ్మెల్యే గళ్లా మాధవి

గుంటూరు, మహానాడు: ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి నిరుపేదలు వచ్చి వైద్యం తీసుకుంటారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా వారికి మెరుగయిన వైద్య సేవలు అందించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి కోరారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరెంటెండ్‌గా నియమితులయిన డాక్టర్ ఎస్.ఎస్.వి రమణ శనివారం గళ్లా మాధవిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రికి నిరుపేదలు అధికంగా వస్తుంటారని, వారి పట్ల వైద్య సిబ్బంది సానుకూల ధోరణితో నడుచుకోవాలని, ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగికి మెరుగయిన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని, ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.