జగన్‌ కు, గొడ్డలి దాడులకు ఇవే ఆఖరి రోజులు

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

జగన్ గొడ్డలి పార్టీకి పోయేకాలం దగ్గర పడుతున్న కొద్దీ రక్త దాహం మరింత పెరిగిపోయింది. ఓటమి భయంతో మునయ్యని మట్టుబెట్టారు వైకాపా సైకోలు. గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన పాముల మునయ్య టిడిపిలో చేరిన రోజే చంపేస్తామని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా చర్యలు శూన్యం. ప్రజాగళం సభకు వెళ్లాడనే కక్షతో దారుణంగా గొడ్డలితో నరికి చంపేశారు. బాబాయ్‌పై అబ్బాయి గొడ్డలి వేటేసి అధికారం దక్కించుకున్నాడు. ఆ అధికారం పోతుందనే భయంతో తెలుగుదేశం జెండా పట్టిన కార్యకర్తలపై గొడ్డలి ఎత్తుతున్నారు. జగన్‌కి, ఆయన సైకో సైన్యానికి, గొడ్డలి దాడులకు ఇవే ఆఖరి రోజులు. మునయ్య కుటుంబానికి టిడిపి అండగా ఉంటుంది. దోషులను చట్టం ముందు నిలబెడతాం.