జగన్‌ పాలనపై విసుగెత్తి మార్పు కోరుకుంటున్నారు

-మంచి ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు
-కూటమిపై అద్భుతమైన స్పందన కనిపిస్తోంది
-తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌

గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు: తెనాలి మండలం పరిధిలోని కటెవరం, ఎరికిలపూడి గ్రామాలలో ఆదివారం ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి తెనాలి అభివృద్ధి ప్రణాళికను వివరించి అత్మీయంగా పలకరిస్తూ ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలు అనేక సమస్యలను విన్నవించారు. అనంతరం మనోహర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో పర్యటిస్తుంటే అద్భుతమైన స్పందన కనపడుతుందని, ప్రజలు మార్పు కోరుకుంటు న్నారని అర్థమవుతుందన్నారు. ప్రభుత్వం సంక్షేమం పేరుతో మోసగించిందని ప్రజలు భావిస్తు న్నారని, పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమం విషయంలో కూడా వివక్షత చూపిస్తున్నారని, క్షేత్రస్థా యిలో ప్రజలు కనీస మౌలిక వసతులు లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపా రు. డ్రైనేజీ వ్యవస్థ, సాగునీటి సమస్యలు, రోడ్డుపై గుంటలు ఏళ్ల తరబడి పేరుకుపోయాయ న్నారు. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.