- పేదలకు నివాసాలు ఇవ్వలేని నాయకులపై పెమ్మసాని ఫైర్
జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం పాల్గొన్న గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం దేశ వ్యాప్తంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు ఇచ్చింది. గత ప్రభుత్వం తీరు వల్ల ఇంటి నిర్మాణాలు చేపట్టడంలో రాష్ట్రం వెనుకబడింది. కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని, నిధులను వినియోగించుకుంటే 5-6 లక్షల ఇళ్లు కట్టించి పేదలకు ఇవ్వవచ్చు.
జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. నరేగా నిధులు సద్వినియోగం చేసుకోవడంలోనూ గత ప్రభుత్వం విఫలమైంది. ఈ అంశంపై ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి వీలైనంత ఎక్కువ పనులు చేయించాలి.
జల్ జీవన్ మిషన్ కోసం కేంద్రం నుంచి రూ. 14 వేల కోట్లు కేటాయింపులు జరిగాయి. గత ప్రభుత్వంలో కేవలం రూ. 2-3 వేల కోట్ల పనులు మాత్రమే జరిగాయి. పూర్తిస్థాయిలో ఈ నిధులను వినియోగించుకుని జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేసుకోవాలి.
జడ్పీ చైర్ పర్సన్ క్రిస్టినా
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. గత ఐదేళ్లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని దుస్థితిలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండటం దారుణం.
ఎన్నోసార్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలసిన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిధులు మంజూరు చేయకుండా నిర్వీర్యం అయింది.
దానిపై విసిగిపోయి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, నరేంద్ర వర్మ,, తెనాలి శ్రావణ్ కుమార్, అరవింద్ బాబు, ఎమ్మెల్సీలు వైసీపీ చంద్రగిరి ఏసు రత్నం, పిడిఎఫ్ ఎమ్మెల్సీ కే ఎస్ లక్ష్మణరావు, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లా కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.