వైకాపాకు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే
గుంటూరు, మహానాడు : పొన్నూరు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశాను. చెప్పుడు మాటలు విని జగన్ నాకు పొన్నూరు నియోజకవర్గం టికెట్ ఇవ్వలేదు. అన్నివిధాలా పార్టీ లో అవమానాలను ఎదుర్కొన్నానని మాజీ ఎమ్మెల్యే కిల్లారి వెంకట రోశయ్య అన్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని నాయకులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో కిల్లారి వెంకట రోశయ్య మాట్లాడారు.
ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ కోసం ఎంతో కృషి చేశాను. కానీ పార్టీ అధికారంలోకి రాగానే కనీస గౌరవం కూడా లభించలేదు. పార్టీని మోసం చేసిన వ్యక్తులను చేరదీసి గౌరవించారు. పార్టీలో గ్రూపులు తయారు చేసిన వారు ఈరోజు మంచి పదవుల్లో ఉన్నారు.
అనుభవం ఉన్న వ్యక్తి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు టికెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తి కి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు. కొందరు పెద్దల సొంత నిర్ణయాల తోనే పార్టీని నడిపిస్తున్నారు. సమాజం లో విలువ లేని వ్యక్తి ని, పార్టీ ఓటమి కోసం పని చేసిన వ్యక్తిని చేరదీశారన్నారని విమర్శించారు.
అందుకే వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిల్లారి వెంకట రోశయ్య సమావేశంలో ప్రకటించారు.