-మంగళగిరి రూరల్ పోలీసుల నిర్వాకం
-కాసుల కోసం మధ్యవర్తితో మంతనాలు
గుంటూరు: శవాలపై పేలాలు ఏరుకునే రకం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థది. డబ్బు కోసం ఎంతకైనా దిగజారతారు. వారి చేతివాటాన్ని నిత్యం మనం కళ్లముందు చూస్తూనే ఉంటాం. కాసులు వస్తున్నాయంటే మూగజీ వుల ప్రాణాలు కూడా తీస్తారనేందుకు ఈ ఘటనే నిదర్శనం. కాజ టోల్‌గేట్ దగ్గర మంగళగిరి రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కంటై నర్‌లో ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. 60కి పైగా ఆవులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. పట్టుకున్న లారీని మంగళగిరి రూరల్ స్టేషన్‌కు కాకుండా గుంటూరుకు తరలించారు. అయితే కనీసం నిర్ధారణ చేసుకోకుండా మంగళగిరి పోలీసుస్టేషన్ సిబ్బంది వాహనాన్ని పంపించారు. లారీలో బర్రెలు ఉన్నాయో, ఆవులు ఉన్నాయో తెలియని అయోమయ స్థితిలో రూరల్ సీఐ సమా ధానం చెబుతున్నారు. మధ్యవర్తి ద్వారా మంతనాలు నడుపుతూ కాసుల కోసం ఖాకీలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు మూగజీవాల వేదన అరణ్య రోదనగా మారింది.