క్రైస్తవులకు అండగా ఉంటా

– ఎమ్మల్యే తంగిరాల సౌమ్య  

నందిగామ, మహానాడు:  క్రైస్తవులకు ఏ అవసరం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా అందుబాటులో ఉంటానని ఎమ్మల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ ఆర్.సి.ఎం చర్చి సంఘస్తులు ఎమ్మల్యే తంగిరాల సౌమ్యకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ…  గతంలో తంగిరాల ప్రభాకరరావుతో ఉన్న ఆత్మీయత, అభిమానాలు తనపై సంఘస్తులు చూపుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. క్రైస్తవులకు ఏ అవసరం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా  అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.

ఆర్.సి.ఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ పులుగు విజయ్ కుమార్,  ఆర్. సి.ఎం. చర్చి కమిటీ సభ్యులు, సంఘస్తులతో పాటు పట్టణ పార్టీ నేతలు పాల్గొన్నారు.