గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని నామినేషన్
కదంతొక్కిన కూటమి నాయకులు, కార్యకర్తలు
ట్రాఫిక్‌తో ఇబ్బంది పడిన ప్రజలకు క్షమాపణలు
నమ్మకం వమ్ము కాకుండా పనిచేస్తానని వెల్లడి
గుంటూరు, మహానాడు : గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని నామినేషన్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు నగరంలో భారీ ర్యాలీ జరిగింది. జన సందోహం మధ్య కార్యకర్తలు కదంతొక్కారు. వీధులు పసుపుమయంగా మారాయి. వేలాదిగా తరలివచ్చిన కూటమి శ్రేణులు, ప్రజలకు పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీ కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బందిపడిన వారికి క్షమాపణలు చెప్పారు. ఇదే స్ఫూర్తి పోలింగ్ రోజున కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి, అమరావ తికి జరిగిన అన్యాయానికి ప్రజలు బదులు చెప్పాలని కోరారు. నా గెలుపు ఖాయం. మెజార్టీ పైనే దృష్టి అని పేర్కొన్నారు. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా పని చేస్తానని తెలిపారు. గుంటూరు పార్లమెంట్ ప్రజలకు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తానని, అవినీతికి తావు లేని రాజకీయాలు చేస్తానని పేర్కొన్నారు.
అఫిడవిట్‌లో కళ్లు చెదిరే ఆస్తులు
అఫిడవిట్‌లో పెమ్మసాని ఆస్తులు, అప్పులను ప్రకటించారు. తనకు 5,700 కోట్ల ఆస్తులు ఉన్న ట్లు పేర్కొన్నారు. చరాస్తి విలువ: రూ.2,316 కోట్లు, భార్య శ్రీరత్న చరాస్తి విలువ: రూ.2,289 కోట్లుగా చూపారు. తనకు రూ.519 కోట్లు, భార్యకు రూ.519 కోట్లు అప్పులు ఉన్నట్లు వెల్లడిరచారు. జేపీఎం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో తన పేరిట రూ.1200 కోట్ల విలువైన షేర్లు, భార్య శ్రీరత్న పేరిట రూ.1200 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు చూపించారు. రూ.6.11 కోట్ల విలువ చేసే రెండు మెర్సిడైజ్ బెంజ్, టెస్లా, రోల్స్ రాయిస్, టయోటా ఫార్చూన్ కార్లు ఉన్నట్లు పేర్కొ న్నారు. బ్యాంకు ఖాతాల్లో తన పేరిట రూ.5.97 కోట్లు, భార్య పేరిట రూ.5.90 కోట్లు, భార్య పిల్లలకు కలిపి 6.86 కిలోలు బంగారు ఆభరణాలు, గుంటూరు జిల్లాలో రూ.2.67 కోట్ల విలువైన వ్యవసాయ భూములు, కృష్ణా జిల్లాలో తన భార్య పేరిట 2.33 కోట్ల విలువైన వ్యవ సాయ భూమి, హైదరాబాద్‌లో 28.10 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములు, అమెరికాలో 6.82 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములు, హైదరాబాద్‌లో 29.73 కోట్ల విలువైన వాణిజ్య భవనం, ఢల్లీిలో రూ.72 కోట్ల విలువైన భవనం, భార్య పేరిట రూ.34.82 కోట్ల నివాస భవనం, అమెరికాలో 28.26 కోట్ల విలువైన నివాస భవనాలు ఉన్నట్లు వెల్లడిరచారు.