ఆ ఐపీఎస్‌లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి

– మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ డిమాండ్‌

గుంటూరు, మహానాడు: ప్రజలను రక్షించాల్సిన ఆ రక్షకబటులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దుర్మార్గంగా వ్యవహరించి, సస్పెండ్‌కు గురయ్యారని, ప్రభుత్వ చర్యను స్వాగతిస్తున్నానని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. అంతేకాదు… ఆ ముగ్గురి ఐపీఎస్‌లపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఐపిఎస్ లను అరెస్టు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో ఏమన్నారంటే..

ఐపీఎస్‌ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. సజ్జల వలనే తాము ఈ విధంగా చేశామని చెబితే వారి గౌరవం పెరుగుతోంది. చంద్రబాబు తమ పార్టీకే చెందిన ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారు. అధికారుల చేత జత్వానీని అరెస్టు చేయించిన సజ్జలను అరెస్ట్ చేయాలి. ట్రిబ్యునల్ కు వెళ్తామనటం సమర్థనీయం కాదు. ముగ్గురిని వైసీపీలో చేర్చుకొని జిల్లా అధ్యక్షులుగా చేయండి. లేదంటే జగన్ సెక్యూరిటీ అధికారులుగా నియమించుకోవాలి. కేంద్రానికి లేఖ రాసి ముగ్గురుని ఐపీఎస్ నుండి తొలగించేలా చర్యలు తీసుకోవాలి.