– ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట, మహానాడు: ప్రజలకు మంచి చేసేవారికి, అందరు మంచినీ కోరుకునే వారికి ఆ షిర్డీసాయి ఆశీస్సులు ఎల్లప్పు డూ ఉంటాయని మాజీ మంత్రి, తెలగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లా రావు అన్నారు. ప్రతిఒక్కరూ సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందుతూ మంచి ఆరోగ్యంతో ముందుకు నడవాలని, అందరికీ సాయి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. శనివారం చిలకలూరిపేట సుబ్బయ్యతోటలోని శ్రీ దత్తసాయి సన్నిధిని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు దర్శించుకున్నారు. షిర్డీ సాయిబాబా 189వ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు. జయజయ సాయి ట్రస్టు ద్వారా సేవాగుణం కలిగిన పలువురికి శ్రీసాయి మహానుభావ ఉత్తమ సేవా పురస్కారాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రతిఒక్కరు ఆనందంగా ఉండాలని సాయిబాబాను వేడుకున్నా అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరికి అభినందనలు తెలిపారు.