– ఎమ్మెల్యే బొజ్జల
విజయవాడ, మహానాడు: బుడమేరు వరదలకు విజయవాడతోపాటు లోతట్టు ప్రాంతాల్లోని వేలాది కుటుంబాలు కట్టుబట్టలతో వీధిన పడ్డాయని శ్రీకాళహస్తి శాసన సభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకోవాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు..
* భారీ వర్షాలు, వరద వల్ల విజయవాడ ప్రజలు తీవ్రంగా దెబ్బతిన్నారు..
* ఈ నేపథ్యంలో ప్రజల కోసం అహర్నిశలు, అనుక్షణం పరితపిస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు..
* ప్రభుత్వ సాయానికి తోడుగా పెద్ద మనసు చేసుకొని శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన పలువురు మంగళవారం సీఎంని కలిసి విరాళాలు అందజేశారు.
* విష్ణు కెమికల్స్ ఇండస్ట్రీవారు రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు..
* నా స్నేహితుడికి చెందిన రేజ్ పవర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రూ.50 లక్షలు డొనేట్ చేశారు..
* వరద సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది..
* ప్రతి ఎమ్మెల్యేకు ఒక డివిజన్ బాధ్యతలు అప్పగించింది..
* నేను 64వ డివిజన్లో సహాయక చర్యలు, శానిటేషన్, నిత్యావసర వస్తువుల సరఫరా వంటి పనులు పర్యవేక్షించా…
* ప్రభుత్వం ప్రజల కోసం ఇంత చేస్తుంటే గత ప్రభుత్వ నాయకులు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు..
* గతంలో వరదలు వస్తే ఏరియల్ సర్వే నిర్వహించి ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితులు..
* కానీ, ఇప్పుడు విజయవాడ కలెక్టరేట్ నే కార్యాలయం గా చేసుకుని సీఎం చంద్రబాబు 10 రోజులుగా పరిపాలన సాగిస్తున్నారు..
* ప్రతి నిమిషం ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు..
* నా భార్య, అమ్మ కూడా వరద బాధితుల నిమిత్తం విరాళాలు సేకరిస్తున్నారు..
* ఇప్పటికే మా అమ్మ రెండు వేల చీరలు పంచి పెట్టారు..
* శ్రీకాళహస్తి ఇండస్ట్రీస్ తరఫున రూ.1.3 కోట్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున రూ.25 లక్షలు అందించారు..
* అలాగే, శ్రీకాళహస్తి హోటల్స్ అసోసియేషన్ కూడా విరాళం అందించనుంది..
* చంద్రబాబు ఒక విజనరీ లీడర్..
* ఈ విపత్తు సమయంలో మేము సైతం అంటూ ముందుకొచ్చి సాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి నా సెల్యూట్..