-హిందూ ధర్మం కోసం పనిచేయరాదని హెచ్చరిక
-చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ
-రేవంత్ నెంబర్ వారికి ఇచ్చా
హైదరాబాద్: తనకు బెదిరింపు కాల్స్ చేసిన వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, తెలంగాణ డీజీపీకి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ రాశారు. వివిధ నెంబర్ల నుంచి కాల్ చేసి చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని, హిందూ ధర్మం కోసం పనిచేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. నాకు వచ్చిన బెదిరింపులో ఒక డీపీని పరిశీలిస్తే పాలస్తీనా ఉగ్రవాది లాగా ఉన్నారు.
హైదరాబాదులో మా స్వీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని బెదిరించారు. నాకు బెదిరింపు కాల్ చేసిన ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెంబర్ కూడా ఇచ్చాను. సీఎం విచారణను సీరియస్‌గా చేస్తారనే ఉద్దేశంతోనే నెంబర్ ఇచ్చినట్లు చెప్పారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నాపై బెదిరింపు కాల్స్ వస్తే విచారణ జరిపించలేదని తెలిపారు.