వెల్దుర్తి, మహానాడు: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం వెలుగుచూసింది. బొటుకులపాయ బేస్ క్యాంపు వద్ద పులి తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అటవీ ప్రాంతంలో నీరులేక జంతువులు సాసర్ పిట్ల వద్దకు వస్తున్నాయని విజయపురి సౌత్ రేంజర్ సత్యనారాయణరెడ్డి అన్నారు. అయితే నాలుగు రోజుల కిందట ఈ పులి సంచరించినట్లు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతం కావడంతో పులుల సంచారం ఇక్కడ ఉంటుందని వివరించారు.