Mahanaadu-Logo-PNG-Large

తిరుపతిని ఏపీ రాజధానిగా ప్రకటించాలి

-సమస్యలకు ఏకైక పరిష్కార మార్గం ఇదే
-ప్రత్యేక హోదా కోసం పార్టీలు కలిసిరావాలి
-ఎంపీలందరూ ఇండియా కూటమిలో చేరాలి
-కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చింతామోహన్‌

దేశ రాజధానిలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు చింతా మోహన్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. తిరుపతిని ఏపీ రాజధానిగా చేయాలని రాజకీయ పక్షాలను వ్యక్తిగతంగా కోరుతున్నాను. రాష్ట్రం ఎదుర్కొంటు న్న అన్ని సమస్యలకు తిరుపతిని రాజధాని చేయడమే ఏకైక పరిష్కార మార్గమని తెలిపారు. ఈ ప్రతిపాదన నా వ్యక్తిగత అభిప్రాయం. నాకు ఆ విధంగా భావ వ్యక్తీకరణ చేసే స్వేచ్ఛ ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు, మంచి రహదారులు, రాజధాని కావల్సినంత భూమి తిరుపతిలో అందుబాటులో ఉంది. పల్నాడు ప్రాంతం, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకు తిరుపతి రాజధానిగా ఆమో దయోగ్యమైంది. ఒంగోలు నుంచి కర్నూలు జిల్లా వరకు 10 జిల్లాల్లో వనరులు లేవు… తినడానికి తిండిలేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి సున్నితమైన క్లిష్ట పరిస్థి తుల్లో అన్ని ప్రజాసమస్యలకు తిరుపతిని రాజధానిగా చేయడమే ఏకైక పరిష్కారం.

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
2014లో ఫిబ్రవరి 25న అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించారు. ఆ తరువాత దీనికి అంగీకరించి అధికారంలోకి వచ్చిన బీజేపీ సున్నా చుట్టింది. రాష్ట్రం ఈరోజు అప్పుల ప్రదేశ్‌గా మారింది. బయటపడాలంటే ప్రత్యేక హోదా పరిష్కారమార్గం. దాని వల్ల పరిశ్రమలు నెలకొల్పే వారికి పన్నుల మినహాయింపు ఉంటుంది. వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి. ఇది ఒక్క కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యం. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కూటమిలోకి రావాలని రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలను, బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలను వేడుకుంటున్నాను. ఇండియా కూటమిలో చేరితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని తెలిపారు.