• కల్తీపై మాట్లాడమంటే జగన్ రెడ్డి పులకేసిలా వ్యవహరిస్తునారు..
– ఆయనకు పులకేసి 3 అనో 4 అనో పేరు పెట్టాలి
• జగన్ వేషాలు జనం నమ్మరు
• టీడీపీ హయాంలోనే దళితులకు టీటీడీ బోర్డులో మెంబర్లు గా ఇచ్చారు
• జగన్ ఒక్క బోర్డు మెంబర్ నైనా దళితులను టీటీడీలో నియమించారా?..
– దళితురాలినైన నన్ను వెళ్లకుండా అడ్డుకున్నారు
• జగన్ కు హిందుత్వంపై విశ్వాసం లేదు
• జగన్ ని తిరుమల వెళ్లకుండా ఎవరూ అడ్డుకోలేదు
• తిరుమల వెళ్లడానికి ఇష్టం లేక, డిక్లరేషన్ పై సంతకం చేయడానికి ఇష్టం లేక కుంటిసాకులు
• సెక్షన్ 30 అనేది కామన్ గా శాంతి భద్రతల పరిరక్షణ కోసం అమలు చేస్తారు
• బ్రహ్మోత్సవాల సమయంలో ఎటువంటి విఘాతాలు కలగకుండా సెక్షన్ 30 ని అమలు
• దాని వక్రీకరిస్తూ.. డైవర్సన్ పాలిటక్స్ చేస్తున్నారు
– జగన్ తెలివి బుర్రలోనుండి మోకాల్లోకి వచ్చింది
• నేను హిందువునని ధైర్యంగా చెబుతున్నా.. జగన్ చెప్పగలరా?
• ఇదేం దేశమని మాట్లాడుతున్న జగన్ పై దేశ ద్రోహం కేసు పెట్టి, తరిమి కొట్టాలి
• హోంమంత్రి వంగలపూడి అనిత
మంగళగిరి, మహానాడు: తిరుమల లడ్డూ కల్తీపై మాట్లాడమంటే జగన్ రెడ్డి పులకేసిలా వ్యవహరిస్తున్నారని.. తిరుమల వెళ్లేందుకు ఇష్టం లేకే, హిందుత్వంపై విశ్వాసం లేకే సెక్షన్ 30 పై కుంటి సాకులు చెబుతున్నారని.. ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదని.. హోంమంత్రి వంగలపూడి అనిత జగన్ పై మండిపడ్డారు. ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. తిరుమల లడ్డూ కల్తీపై జగన్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. తిరుమలకు వస్తానన్న జగన్ రెడ్డి కుంటిసాకులతో ఆగిపోయారు. 10 వేల మందితో తిరుమలకు జగన్ రెడ్డి వస్తారన్న విస్తృత ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. వారి పర్యటనను అడ్డుకుంటామని ప్రజాసంఘాలు, ధార్మిక సంఘాలు ప్రకటించాయి. అందుకే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు సెక్షన్ 30 యాక్ట్ ను అమలు చేశారు. ఇది రెగ్యులర్ గా ఉండే యాక్టే.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఎటువంటి అల్లర్లకు తావులేకుండా తిరుపతి జిల్లా పోలీసులు సెక్షన్ 30ని అమలు చేశారు. దాన్ని ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్లి తప్పుదోవ పట్టించాలని జగన్ రెడ్డి మీడియా ముందు వచ్చి అబద్దాలు చెబుతున్నారు. జగన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా.. ఒక్క నాయకున్ని అయినా హౌస్ అరెస్ట్ చేశామా..? ఒక్క నాయకున్ని అయినా ప్రివెంటీవ్ అరెస్ట్ చేశామా? ఒక్క నాయకుడి ఇంటి దగ్గరైనా పోలీసుల పహారా పెట్టామా? ఎక్కడే గాని పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి లేదు. వైసీపీ నేతలు భారీగా జనసమీకరణ చేసేందుకు ప్లాన్ చేసుకోవడం, ధార్మిక సంఘ నేతలు జగన్ రెడ్డిని అడ్డుకుంటామని చెప్పడంతోనే బ్రహ్మోత్సవాలకు, భక్తులకు ఇబ్బంది కలగకూడదని సెక్షన్ 30 నోటీసులు ఇచ్చారు పోలీసులు. అది కూడా జగన్ రెడ్డికి ఇవ్వలేదు. ఆయన్ను రావద్దు అని ఎవరు చెప్పలేదు. ఆయన వస్తే అరెస్ట్ చేస్తామని ఎవరు చెప్పలేదు.
చంద్రబాబును ఎయిర్ పోర్టులో ఆపినట్లు జగన్ రెడ్డిని ఎప్పుడూ ఆపలేదు. నిజంగా జగన్ రెడ్డిని ఆపాలనుకుంటే.. ఆయన సెంట్రల్ జైళ్ళ విజిట్ లు చేయగలిగేవారా? ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు వెళ్తుంటే పోలీసులపై బురదచల్లేందుకు యత్నిస్తున్నారు. జగన్ రెడ్డికి అసలు తిరుపతికి వెళ్లడానికి ఇష్టం లేదు. డిక్లరేషన్ ఇచ్చి వెళ్లడానికి అసలే ఇష్టం లేదు. డిక్లరేషన్ ఇచ్చి వెళితే ఆయన ఇంట్లో తల్లికి, చెల్లికి పట్టిన గతే అతనికి పడుతుందేమోననుకునే వెళ్లలేదు. ఆ మర్మ ఏంటో మరి? బ్రహ్మోత్సవాల సమయంలో రాజకీయ నాయకులతో పాటు సుప్రీంకోర్టుల జడ్జీలు కూడా వచ్చే అవకాశం ఉంది. శాంతిభద్రతల పరిరక్షణకోసమే సెక్షన్ 30 అమలు చేశారు. కల్తీ నెయ్యిపై మాట్లడకుండా డైవర్సన్ పాలిటిక్స్ చేస్తున్నారు. జగన్ రెడ్డి ఏనాడైనా తిరుమల లడ్డూను టేస్ట్ చేశారా? ఆశీర్వాదం ఇచ్చిన అక్షింతలను పదిసార్లు దువ్వుకుని తీసేసిన వ్యక్తి.. ఎవరైనా లడ్డూ ఇస్తే.. టిష్యూ పేపర్ లో చుట్టి పక్కన పెట్టే వీళ్లు లడ్డూ నాణ్యత గురించి టేస్ట్ గురించి మాట్లాడం…. మనం వినడం దౌర్భాగ్యం.
జూన్ నెల వచ్చిన లారీల్లోని నెయ్యి సక్రమంగా లేదని భక్తుల నుండి ఫిర్యాదులు రావడంతో మిగిలిన నాలుగు ట్యాంకర్లలోని నెయ్యిని ఎన్‌డీడీబీ ద్వారా టెస్ట్ చేయిస్తే .. అందులో జంతువుల కొవ్వుకలిగిన ఆయిల్ కలిసిందని స్పష్టం అయ్యింది. కల్తీపై మాట్లాడకుండా ఎన్‌డీడీబీలో డిస్క్లైమర్ గురించి మాట్లాడుతున్నారంటే జగన్ తెలివి బుర్రలోనుండి మోకాల్లోకి వచ్చిందని అర్థం అవుతుంది. డిస్క్లైమర్ అనేది ఏ వస్తువు కొన్న ఉంటుంది.. జరిగిన తప్పును కప్పిపుచ్చుకోవడం చేస్తున్నారు కాని జరిగిపోయిన తప్పును ఒప్పుకోవడం, క్షమాపణలు కోరడం కాని చేయడంలేదు. మాజీ స్పీకర్… మరో గ్రేట్ లాయర్ ఇరువురు పంది కొవ్వు వాటి రేట్లు గురించి మాట్లాడుతున్నారంటే.. వాళ్లను వారి ఆలోచనను ఏమనుకోవాలి. దీనిపై సిట్ ఏర్పాటు చేస్తే.. సొంత మనుషులతో సిట్ చేర్పాటు చేశారని మాట్లాడుతున్నారు. సిట్ ఏమైనా సాక్షి ఉద్యోగస్తులతో వేయాలో ఏమో? సిట్ లో ఉన్న ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పోలీసు అధికారులే. వారి తప్పును కప్పెట్టడానికి ఎలాంటి విమర్శలైనా సిగ్గులేకుండా చేస్తారు.
లడ్డూ గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా గతంలో కేసులు కూడా పెట్టారంటే ఎంతటి ఘోర పాపాలు చేశారో అర్థం చేసుకోవచ్చు. జగన్ ఫ్యామిలీ…. క్రిస్టియన్ ఫ్యామిలీ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. డిక్లరేష్ తీసుకుని తిరుమల శ్రీవారి మీద నమ్మకం ఉందని వెళితే తప్పేంటి. కోడిగుడ్లు విసురుతారు, టమాటాలు విసురుతారని కరుణాకర్ కాకమ్మ కథలు చెప్పడం దౌర్భాగ్యం, సిగ్గుచేటు. ఒక వేళ వాళ్లు దర్శనానికి వచ్చినా వాళ్లే దాడులు చేయించుకుని గుళకరాయి, కోడికత్తిలా మళ్ళీ జనాలపైన నెపం వేస్తారేమో.
హిందూవులు, క్రైస్తవులు, ముస్లింల పవిత్రమైన ఆలయాలు, చర్చీలు, మసీదుల్లోకి వెళ్లేప్పుడు అక్కడి ఆచారాలు సంప్రదాయాలు పాటించడం తప్పనిసరి. జగన్ రెడ్డి పొరపాటు చేసి కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా దళితులకు ఆపాదించడం సిగ్గుచేటు. అసలు దళితుల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి ఎక్కడ ఉంది. దళితులు అన్న పదం జగన్ నోటినుండి రావడానికి కూడా అనర్హుడు. టీటీడీ బోర్డును భ్రష్టుపట్టించిది జగనే. 50 మంది సభ్యులతో పెట్టిన బోర్డులో 6 మందికి నేర చెరిత్ర ఉందని హైకోర్టే చెప్పింది. నేడు దళితుల గురించి మాట్లాడుతున్న జగన్.. ఆ బోర్డులో ఒక్క దళితుడికి కూడా స్థానం ఎందుకు కల్పించలేదు?
మా హయాంలో ఇప్పటి మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి నాడు బోర్టు మెంబర్ గా ఉన్నారు. నేను టీటీడీ బోర్డు మెంబర్ గా ఉంటే.. దళితరాలునైన నన్ను కూడా వెళ్లకుండా జగన్ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో అబాండాలు వేసి వేధించారు. పిచ్చి మూకలు అబాండాలు వేసినంత మాత్రాన నేను వెంకటేశ్వరస్వామికి దూరం కాలేదు. నేను హిందువునని ధైర్యంగా చెబుతాను నువ్వు చెప్పగలవా జగన్ రెడ్డి. డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే పారిపోయిన నువ్వు. ఇప్పుడు మళ్లీ మాట్లాడుతున్నావ్ సిగ్గులేకుండా?
దళితులు అంటే జగన్ రెడ్డికి ఎందుకు అంత చిన్న చూపు. తిరుమల తిరుపతి దేవస్థానం కింద డిప్యూటీ ఈవోలుగా చాలా మంది దళితులు ఉన్నారు. వెళ్లి చెక్ చేసుకో. నీ హయాంలో లేకపోవచ్చేమో కాని మా హయాంలో దళితులకు ఎంతో గౌరవం ఉంటుంది. మానవత్వం అని మాట్లాడుతున్నారు.. జగన్ రెడ్డి మానత్వం గురించి మాట్లాడితే ఆ మానవత్వం అనే పదమే సిగ్గుపడుతుంది. జగన్ నోట్లోనుండి ఆ మాట వస్తే. జగన్ రెడ్డి మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు తన బాబాయి గొడ్డలివేటు.. తన చెల్లి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నది, సొంత చెల్లి షర్మిల రోడ్డెక్కి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఆలోచించుకోవాలి.
ఇదేం దేశమని జగన్ మాట్లాడుతున్నాడంటే దేశం విడిచి పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నారేమో.. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని కొల్లగొట్టి బయట దేశాల్లో దాచేసి దేశం విడిచి వెళ్లిపోవడానికి సిద్దమైయ్యే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దేశ ద్రోహం చట్టం ఉండి ఉంటే జగన్ రెడ్డి మాటలకు ఆ కేసు పెట్టాలి. జగన్ రెడ్డి కి దేశ బహిష్కరణ అనేదే కరెక్ట్ . భారత దేశంలో పుట్టి ఇతర దేశాల్లో ఉన్నవారు తాము సగర్వంగా తమది భారత దేశం అని చెబుతుంటే.. జగన్ రెడ్డి భారతదేశంలో ఉండి ఏపీకి ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ఇదేం దేశం అంటున్నారంటే ఇతను సెక్యులరిజం గురించి, మానవత్వం గురించి మాట్లాడానికి అర్హత ఉందా?.
జగన్ ను ఎవరూ ఆపడంలేదు. కలాం, షారూఖాన్, సోనియాగాంధీ లాంటివారు డిక్లరేషన్ ఇచ్చి గోవిందుడిపై నమ్మకం ఉందని స్వామివారిని దర్శించుకున్నారు. జగన్ హిందుత్వాన్ని గౌరవించడం ఇష్టం లేక నేడు కుంటిసాకులు చెబుతున్నారు. భారత దేశంలో ప్రతి సంప్రదాయాన్ని గౌరవించాలి. భక్తులు మనోభావాలు దెబ్బతిసేలా వ్యవహరించడం సరికాదు. జగన్ రెడ్డి ఎన్ని వేషాలు వేసినా ఆయన్ను జనాలు నమ్మే పరిస్థితిలో లేరు.