దేవాదాయ సమస్యలపై అధికంగా అర్జీలు: మంత్రి ఆనం

జగన్‌వి చిల్లర రాజకీయాలు: పోలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల విమర్శ

మంగళగిరి, మహానాడు: గ్రీవెన్స్ కార్యక్రమంలో దాదాపు 250 కిపైగా వితులు వచ్చాయని.. వాటిలో నేడు అధికంగా దేవాదాయ శాఖకు చెందిన అర్జీలు వచ్చాయని ఆశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అతెలిపారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, టీడీపీ నేతలు బుచ్చి రాంప్రాసాద్, రమణలతో అర్జీదారులు ఇచ్చిన వినతుల పరిష్కారానికి కృషి చేసినట్టు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మంగళగిరి జాతీయ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడారు.

వచ్చిన అర్జీల్లో కొన్నింటిని వెంటనే పరిష్కరించాం.. మరికొన్ని ఆ శాఖకు పంపి పరిష్కరిచేలా చర్యలు తీసకున్నాం. టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయానికి నిజమైన సమస్యతో వస్తే తమకు న్యాయం జరుగుతుందని అర్జీదారులు సంతోషంగా వెళుతున్నారు. వచ్చిన అర్జీలపై ఫోన్లు చేసి టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే అక్కడికి అక్కడే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. నిజమైన సమస్యలు కలిగిన వారికి ఒక పరిష్కర వేదిక టీడీపీ ప్రధాన కార్యాలయం. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, నేతలు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి రోజు కృషి చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యం. వారికి నమ్మకం భరోసా కల్పించేలా గ్రీవెన్స్ నడుస్తోంది.

చట్ట ప్రకారం న్యాయం పొందుతున్నామని అర్జీదారులు భావిస్తే… ప్రభుత్వ కార్యాలయాల్లో కంటే పార్టీ కార్యాలయానికే ఎక్కువ అర్జీలు వస్తాయి. ప్రజల సమస్యల పరిష్కారానికి మా అధినేత ఆలోచన చాల గొప్ప విషయం. ఇది నిరంతరం కొనసాగుతోంది. దేవాలయాల భూ కబ్జాలపై సంబంధిత నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించాం. దేవాలయాల ఆస్తులను కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. దాదాపు ఆరు లక్షల 40 వేల ఎకరాలు దేవాదాయ ఆస్తులుగా ఉన్నాయి. లక్షా 50 వేల ఎకరాల భూమి సర్వీస్ ఇనామ్ ల కింద ఉన్నాయి. ఈ భూములను కూడా అన్యాక్రాంతం చేశారు. నేడు కొంత మంది నాయీ బ్రాహ్మణలు వచ్చి 22ఏ1సీ కింద భూములు ఉన్నాయని… వాటిని దేవాలయ భూమిగా చూపిస్తున్నారని చెప్పారు. కాని సర్వీస్ ఇనాం ఇచ్చిన భూమికి వారు సేవా కార్యక్రమాలు చేస్తేనే ఆ భూములను అనుభవించడానికి ఉంటుంది కాని అమ్ముకోవడానికి లేదని వారికి వాస్తవం చెప్పి పంపించాం.

టీటీడీలో జరిగిన అక్రమ కార్యక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది. ఈవోగా అర్హత లేని వ్యక్తికి అడిషనల్ ఈవో గా పదవిని సృష్టించి కట్టబెట్టారు. టీటీడీలో పదవిని చేపట్టి అన్ని అర్థాలకు కారమణమైన ధర్మారెడ్డి అనేక తప్పుడు కార్యక్రమాలకు పాల్పడ్డారు. తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభం అవుతుందని చంద్రబాబు చెప్పారు. అందులో భాగంగానే విజిలెన్స్ ఎంక్వైరీ వేశాం.. కొన్ని నివేదికలు మా దృష్టికి వచ్చాయి.. త్వరలోనే చర్యలు తీసుకుంటాం. పూర్తి నివేదిక రాగానే టీటీడీపీ ప్రక్షాళన చేస్తాం.. ఇంకోసారి ఇలాంటి అక్రమాలు జరగకుండా చూస్తాం.

ఒక అసిస్టెంట్ కమిషన్ ఉద్యోగికి అంత ఆస్తులు ఎలా వచ్చాయి. నాటి ప్రభుత్వంలో కొంతమందితో పరిచయాలు పెట్టుకున్ని అన్ని తానే అయ్యి తన శాఖకు సంబంధం లేకపోయినా కూడా అన్ని పనులు చేసింది. అక్రమార్జనకు పాల్పడిందని ఆమెపై ఎంక్వైరీ చేస్తే… ఎవ్వరూ చెప్పకూడని విషయాలు కూడా మా తెలిశాయి. ప్రభుత్వ పరంగా మా పరిధి ఉన్నంత వరకే అక్రమ ఆస్తులపై అసిస్టెంట్ కమిషన్ గా ఉన్న ఆమెను సస్పెండ్ చేశారు. విజిలెన్స్ నుండి పూర్తి నివేదిక రాగానే ప్రభుత్వపరంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రేమ సమాజం భూములను సమాజ సేవకు, పరుల సేవకు పనిచేయాలని ఆనాటి పెద్దలు ప్రేమ సమాజాన్ని అందుకే స్థాపించారు. కాని నేడు ఆ ప్రేమ సమాజం పేరే మార్చేసేలా అక్కడ కొందరు స్వార్థపరులు పనిచేశారు.

శాసన సభ అంటేనే పెద్దల సభ నేడు పెద్దల సభలో ఉన్న వాళ్లే దారుణంగా అక్రమ సంబంధాలతో ఉన్నారు. అక్రమ సంబంధాలతో రొడ్డెక్కిన వారు ఎలా సభకు వచ్చి మండలిలో మాట్లాడుతారు. సభమీద గౌరవం ఉన్నా తన కుటుంబంపై సానుకూల వాతావరణం ఉన్నా.. దువ్వాడ శ్రీనివాస్ శాసనమండలి సభ్యత్వాన్ని వదిలిపెట్టి తన కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాలి. దోపిడీకి నెలవైన వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి శ్రీనివాస్ చేత రాజీనామా చేయించాలి. ఇప్పటికే వైసీపీని రాష్ట్ర ప్రజలు సమాధి కట్టారు. ఇక పుష్పగుచ్ఛం పెట్టడమే ఆలస్యం.

జగన్‌ రెడ్డివి చిల్లర రాజకీయాలు: వల్ల రామయ్య విమర్శ

జగన్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు గుణపాఠం నేర్పినా మారడంలేదు. దళిత బిడ్డలు మాకొద్దు ఈ జగన్ అని తగిన శాస్తి చేశారు. ప్రపంచ మేథావి బీఆర్ అంబేద్కర్ పేరును పక్కన పెట్టి జగన్ విదేశీ విద్యాదీవెన అని పేరు పెట్టుకున్నారు. ప్రతిపక్షంగా మేము వ్యతిరేకించినా వినలేదు. దళితులు దాన్ని మనుసులో పెట్టుకున్నారు. సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పారు. బీఆర్ అంబేద్కర్ ను ప్రపంచ దేశాలు అన్ని గౌరవిస్తాయి. 11 కేసుల్లో ఛార్జ్ షీట్ లు ఎదుర్కొంటూ.. 5 కేసుల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ లు ఎదుక్కొంటూ ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడిగా పేరుపొందిన ఈ జగన్ రెడ్డి ..దళితులకు దేవుడిలాంటి అంబేద్కర్ పేరును తీసేయడంపై ఆగ్రహించి ఎన్నికల్లో తగిన శాస్తి చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కుండా చేశారు.

మళ్లీ అదే చిల్లర రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలో 100 కోట్ల చిల్లరకే ఏపీలో కంటే గొప్పగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే.. ఇక్కడేమో 400 కోట్లకు పైగా ఖర్చుపెట్టి దోచుకున్నారు. మళ్లీ అంబేద్కర్ పేరును చిన్నగా పెట్టి.. జగన్ రెడ్డి పేరును పెద్దగా పెట్టారు. అంత అవమానం జరిగినా… వైసీపీ ప్రభుత్వంలో దళితులు నోరు మెదపలేదు. నాడు కడుపు మండిన దళితులు నేడు జగన్ పేరును తొలగిస్తే దాన్ని వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు.

అంబేద్కర్ విగ్రహానికి చిన్న దెబ్బతగల్లేదు. జగన్ రెడ్డి పేరును మాత్రమే తొలగించారు. ప్రతి పక్ష హోదా కూడా దక్కకపోవడంతో దుష్ట రాజకీయానికి జగన్ రెడ్డి తెరలేపాడు. జగన్ రెడ్డి ఎంత ఫేక్ రాజకీయం చేయాలనుకున్నా నేడు దళితులు నమ్మడంలేదు. జగన్ రెడ్డి దుష్ట రాజకీయానికి పావులుగా మారడానికి ఏ దళితులు సిద్ధంగా లేరు.