Mahanaadu-Logo-PNG-Large

శ్రీశైలంలో దంచికొట్టిన వర్షం

-ఆలయం దగ్గర ఈదురుగాలులతో అలజడి
-రేకుల షెడ్ల కిందకు పరుగులు తీసిన భక్తులు

శ్రీశైలం, మహానాడు: శ్రీశైలం మండలంలో అర్ధగంట పాటు కుంభవృష్టి కురిసింది. శ్రీశైలం, సున్ని పెంట, లింగలగట్టులో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి క్షేత్రంలో అలానే సుండిపెంటలో ప్రధాన విధులు జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్న వాతావరణం మధ్యాహ్నానికి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని భారీ వర్షం మొదలైంది. వర్షం కారణంగా శ్రీశైలం క్షేత్రానికి వచ్చిన భక్తులు దర్శనానికి వెళుతూ అకాల వర్షంతో రేకుల షెడ్ల కిందకు పరుగులు తీశారు. మరికొందరు భక్తులు వసతిగృహాలకు పరిమితమయ్యారు ఎండ, ఉక్కపో తకు గురైన స్థానికులు భక్తులు భారీ వర్షం పడటంతో కొద్దిపాటి ఉపశమనం పొందారు. ఉరుములు మెరుపులు ఈదురుగాలితో వర్షం మొదలవడంతో ముం దస్తుగా విద్యుత్‌ అధికారులు శ్రీశైలం క్షేత్రంలో విద్యుత్‌ను నిలిపివేశారు.