-పార్లమెంటు స్థానాల్లో ఆసక్తికరం
-పీపుల్స్ పల్స్ సర్వే ఫలితాలు
-వినిపించని కారు మాట
-కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోరు
-కాంగ్రెస్‌కు 7-9, బీజేపీకి 6-8
-బీఆర్‌ఎస్‌కు 0`1, ఎంఐఎంకు 1
-మూడుచోట్ల ముక్కోణపు పోటీ
హైదరాబాద్: తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా, నేనా అన్న విధంగా పోరునడిచింది. పీపుల్స్ పల్స్ సర్వేలో కాంగ్రెస్ 7-9, బీజేపీ 6-8, బీఆర్‌ఎస్ 0-1, ఎంఐఎం 1 గెలుపొందే అవకాశాలున్నట్లు వెల్లడిరచింది. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్‌ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానం కూడా దక్కే అవకాశాలు లేవని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, నల్గొండ, భువనగిరి, నాగర్‌కర్నూ ల్ పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. బీజేపీ చేవేళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని సర్వేలో వివరించింది. ఎంఐఎం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలుపొందే అవకాశం ఉందని చెప్పింది. ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో గతంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా ఈ సారి భారీగా తగ్గే అవకాశం ఉందని తన సర్వేలో పీపుల్స్ పోల్ వెల్లడిరచింది. మెదక్, మహబూబ్‌నగర్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్-బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని విశ్లేషించింది.