హైదరాబాద్, మహానాడు: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని అందించడాన్ని హర్షిస్తూ బుధవారం గల్ఫ్ సంఘాల పక్షాన టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ నాయకులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కలిసిన వారిలో టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ చైర్మన్ వినోద్‌కుమార్, ఈరవత్రి అనిల్, తదితరులు ఉన్నారు.