పెనమలూరు: పట్టణంలో ట్రాఫిక్ ఏఎస్సై ద్విచక్రవాహనం చోరీకి గురైంది. తాడిగడపకు చెందిన భగవతి పెనమలూరు పోలీసుస్టేషన్‌లో ట్రాఫిక్ ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారంరోజుల కిందట సమీపంలోని తన కుమార్తె ఇంటికి వెళ్లాడు. అక్కడ తన బైకును నిలిపి తాళం వేసి తర్వాత రోజు ఉదయం వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. దాంతో పెనమలూరు పోలీ సులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.