వయనాడ్, మహానాడు : వయనాడ్‌లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 24 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు పేర్కొన్నారు. |
కొండచరియలు విరిగిపడి చురల్‌మలా గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. కొండచరియలు పడి 400 కుటుంబాలు చిక్కుకున్నాయి. వరద నీటిలో మృతదేహాలు కొట్టుకు వస్తున్న దృశ్యం అక్కడి పరిస్థితిని ప్రతిబింబిస్తుంది.
ఘటనాస్థలికి వెళ్లే రోడ్డు మార్గాలు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో అధికారులు వయనాడ్ లోయ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.