– డిప్యూటీ సీఎం.. అతనొక పవర్ లెస్ మంత్రి
• మౌలానా అబుల్ కలామ్ జయంతి నాడు, మైనారిటీలను ఉద్ధరించానని జగన్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం, ఆ మహానీయడిని, మైనారిటీలను అవమానించడమే : ముస్తాక్ అహ్మద్
• నాలుగేళ్లలో మైనారిటీల సంక్షేమానికి రూ.23 వేలకోట్లు ఖర్చుపెట్టామంటున్న జగన్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధం.. నవరత్నాలనే రంగురాళ్లతో మైనారిటీలను జగన్ దారుణంగా వంచించాడు : సయ్యద్ రఫీ
– టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ , అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ టీడీపీ
హజరత్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి.. మైనారిటీ సంక్షేమ దినోత్సవం నాడు, ముస్లిం మైనారిటీలను ఉద్ధరించినట్టు ముఖ్యమంత్రి గొప్పలు చెప్పాడని, వాస్తవంలో మాత్రం మైనారిటీలను దారుణంగా మోసగించాడని, నాలుగున్నరేళ్లలో వారిపై దాడులు.. హత్యలు.. వేధింపుల వంటి దురాగతాలకు పాల్పడ్డాడని, మైనారిటీల సంక్షేమానికి వినియోగించాల్సిన రూ. 5,400కోట్లను జగన్ రెడ్డి మింగేశాడని టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే …
“ 2019 ఎన్నికల సమయంలో మైనారిటీలను మాయమాటలతో మోసగించిన జగన్ రెడ్డి, వారి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక బీజేపీకి వంతపాడటం మొదలెట్టా డు. బీజేపీ తీసుకొచ్చే అన్ని చట్టాలకు తనపార్టీ ఎంపీలతో జగన్ రెడ్డి మద్ధతు తెలిపా డు. మైనారిటీలు రాష్ట్రంలో ఉండటమే జగన్ రెడ్డికి ఇష్టంలేదు. సీఏఏ ఎన్.ఆర్.సీ చట్టానికి వైసీపీ ఎంపీలు మద్ధతు ప్రకటించకపోతే, అసలు ఆ చట్టమే నిలబడేది కాదు . మైనారిటీల ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చే ఆ చట్టానికి జగన్ ఎందుకు మద్ధతు పలి కాడో.. తన పార్టీ ఎంపీలతో పార్లమెంట్ ఉభయసభల్లో బీజేపీ నిర్ణయాలకు ఎందుకు జేజేలు కొట్టించాడో ముందు రాష్ట్రంలోని మైనారిటీలకు సమాధానం చెప్పాలి.
ముస్లిం మైనారిటీలు వ్యతిరేకిస్తున్న అనేక నల్లచట్టాలకు, ఆర్టికల్ 370కి జగన్ మద్ధతు పలక డం మైనారిటీలకు ద్రోహం చేయడం కాదా? చేయాల్సిన దారుణాలన్నీ చేసి… మైనారిటీల రక్షణ.. అభివృద్ధి..సంక్షేమాన్ని తుంగలో తొక్కి, నేడు ముస్లింలను ఉద్ధరించానని.. ముస్లిం సమాజానికి న్యాయం చేశానని జగన్ చెప్పడం అతని దిగజారుడుతనానికి నిదర్శనం.
మౌలానా అబుల్ కలామ్ జయంతి నాడు, మైనారిటీలను ఉద్ధరించానని జగన్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం, ఆ మహానీయడిని, మైనారిటీలను అవమానించడమే.
రాష్ట్రంలో దాదాపు 60లక్షలకు పైగా ఉన్న ముస్లింల సంక్షేమ పథకాలను రద్దుచేసిన జగన్ రెడ్డి వారి నోట్లో మట్టికొట్టాడు. చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ముస్లింల కోసం అమలు చేసిన రంజాన్ తోఫా, దుకాన్-మకాన్, దుల్హన్, వంటి అనేక పథకాల్ని జగన్ అధికారంలోకి వచ్చాక రద్దుచేశాడు.
చంద్రబాబు ప్రభుత్వం కర్నూల్లో అబ్దుల్ హక్ విశ్వవిద్యాలయం నిర్మాణం మొదలుపెడితే, జగన్ అధికారంలోకి రాగానే దాన్ని నిలిపివేశాడు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ కు విద్య అంటే చాలా ఇష్టం. ఆ మహానుభావుడు దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. విద్యతోనే మైనారిటీల జీవితాల్లో గొప్ప మార్పులు వస్తాయని ఆయన బలంగా విశ్వసించారు. అలాంటి వ్యక్తి జయంతి నాడు కూడా జగన్ రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం, ఆ మహానీయడిని, మైనారిటీలను అవమానించడమే.
చంద్రబాబునాయుడి న్యాయపోరాటం వల్లే రిజర్వేషన్ ఫలాలు ముస్లింలకు దక్కాయి ముస్లింల ద్రోహి జగన్ రెడ్డి. *మైనారిటీల సంక్షేమానికి వెచ్చించాల్సిన సొమ్ముని దిగమింగిన పెద్ద గజదొంగ
టీడీపీ అధినేత చంద్రబాబు ముస్లింల రిజర్వేషన్లపై న్యాయ పోరాటం చేసి, ఆ ఫలాలు వారికి దక్కేలా చేశారు. ఆయన న్యాయస్థా నాల్లో పోరాటం చేయకుంటే..గత పాలకులు తూతూమంత్రంగా ఓట్లకోసం తీసుకొచ్చిన రిజర్వేషన్లు ఎప్పుడో మురిగిపోయేవి. ఈ వాస్తవాన్ని మైనారిటీ సమాజం గ్రహించాలి. మైనారిటీల రక్షణకోసం చంద్రబాబు నాయుడు ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా దాచేపల్లి లో ఒకఘటన జరిగితే 24 గంటల లోపునే చంద్రబాబు స్పందించారు. అదీ ఆయన మైనారిటీలకు ఇచ్చిన భరోసా.
జగన్రెడ్డి హయాంలో ఎన్ని మైనారిటీ కుటుంబాలు రోడ్డునపడ్డాయో లెక్కేలేదు. సొంతపార్టీకి చెందిన నాయకుడు మిస్బా అనే బాలిక మర ణానికి కారణమైతే, అతనిపై జగన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అబ్దుల్ సలాం.. అబ్దుల్ సత్తార్ కుటుంబాలు వైసీపీనేతల వేధింపులు..
బెదిరింపులకు బలైపోతే అందు కు కారకులైన తనపార్టీ నేతల్ని జగన్ రెడ్డి మాటమాత్రంగా కూడా దండించలేదు. తాము కాజేయాలనుకుంటున్న వక్ఫ్ ఆస్తులకు అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో షేక్ ఇబ్రహీంను వైసీపీనేతలు దారుణంగా నడిరోడ్డుపై చంపితే జగన్ రెడ్డిలో చలనం లేదు.
జగన్ పాలనలో మైనారిటీలకు రక్షణ లేనేలేదు అనడానికి ఇలాంటి అనేక ఘటనలే నిదర్శనం. ముస్లిం ద్రోహి జగన్ రెడ్డి. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి.. మైనారిటీల సంక్షేమానికి వినియోగించాల్సిన సొమ్ముని దిగమింగిన పెద్ద దొంగ జగన్ రెడ్డి. షాదీఖానాలు… మస్జిద్ లు, ఖబరిస్తాన్ ల నిర్మాణానికి టీడీపీప్రభుత్వం నిధులిస్తే.. జగన్ వచ్చాక రూపాయి ఇవ్వలేదు. టీడీపీప్రభుత్వం అన్యాక్రాంతమైన 300 ఎకరాల వక్ఫ్ భూముల్ని కబ్జాదారుల చెర నుంచి విడిపిస్తే.. జగన్ రెడ్డి హాయాం లో వక్ఫ్ భూములు.. ఆస్తులు వైసీపీనేతలే కబళిస్తున్నారు.
పేరుకే అంజాద్ బాషా డిప్యూటీ సీఎం.. అతనొక పవర్ లెస్ మంత్రి
డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేరుకే మైనారిటీ శాఖా మంత్రి. అతనొక పవర్ లెస్ మంత్రి. పవర్ జగన్ చేతికిచ్చి..తన ఆస్తులు పెంచుకుంటున్నాడు. అతనివల్ల మైనారిటీసమాజానికి… వక్ఫ్ భూములు.. ఆస్తుల రక్షణకు ఒరిగిందేమీలేదు. వక్ఫ్ భూముల్ని తానే కాజేస్తూ.. మైనారిటీల ప్రతినిధినని చెప్పుకోవడం అంజాద్ బాషాకే చెల్లింది. టీడీపీ ప్రభుత్వం వక్ఫ్ భూములు.. ఆస్తుల రక్షణకోసం తీసుకొచ్చిన జీవోనెం-18ను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు. వక్ఫ్ బోర్డు భూములు.. ఆస్తుల్ని మింగేయడానికే జగన్ రెడ్డి.. ఆబోర్డులో ప్రభుత్వాధికారుల్ని కాదని, సొంతపార్టీ నేతల్ని నియమిం చాడు. మైనారిటీల సంక్షేమం.. అభివృద్ధి…రక్షణ చంద్రబాబునాయుడితోనే సాధ్యం. 2024లో ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం.. మైనారిటీల జీవితాలు మారడం ఖాయం.” అని ముస్తాక్ అహ్మద్ తేల్చిచెప్పారు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మైనారిటీలకు కష్టాలు..నష్టాలు..బాధలే మిగిలాయి : సయ్యద్ రఫీ (టీడీపీ అధికారప్రతినిధి)
“ భారత తొలి విద్యాశాఖ మంత్రి, మహనీయుడు, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 135వ జయంతి నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి నిస్సిగ్గుగా పచ్చిఅబద్దాలు చెప్పాడు.
నాలుగేళ్లలో మైనారిటీల సంక్షేమానికి రూ.23 వేలకోట్లు ఖర్చుపెట్టామంటున్న జగన్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధం
నాలుగేళ్లలో రూ.23వేలకోట్లు అచ్చంగా మైనారిటీల సంక్షేమం కోసమే వెచ్చించినట్టు జగన్ రెడ్డి చెప్పడం ముమ్మాటికీ పచ్చి అబద్ధమే. నవరత్నాలనే రంగురాళ్లు ఎన్ని మైనారిటీ కుటుంబాలకు అందాయో లెక్కలేసుకొని.. వాటికోసం ఖర్చుపెట్టిన సొమ్ము ని ప్రత్యేకంగా మైనారిటీలకోసమే వెచ్చించానని జగన్ రెడ్డి చెప్పడం నిజంగా సిగ్గుచేటు . నాలుగున్నరేళ్ల పాలనలో ప్రత్యేకంగా మైనారిటీలకోసం జగన్ రెడ్డి ఒక్కరూపాయి ఖర్చుపెట్టలేదు. పైగా బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి కేటాయించిన రూ.5,400కో ట్లు కాజేశాడు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మైనారిటీలు కష్టాలు..నష్టాలు..బాధలే మిగిలాయి.
అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్యపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించలేదో జగన్ చెప్పాలి
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం రైలుకింద పడి చనిపోవడానికి స్థానిక వైసీపీఎమ్మెల్యే..అక్కడి పోలీసులు కారణం కాదా? కాదని జగన్ రెడ్డి చెప్పగలడా? ఇం త దారుణమైన సంఘటన దేశంలో ఎక్కడా జరగలేదు. కానీ దానిపై జగన్ రెడ్డిలో ఎలాంటి స్పందనాలేదు. అబ్దుల్ సలాం కుటుంబం బలికావడంపై సీబీఐ విచారణ జరి పించి దోషుల్ని కఠినంగా శిక్షిస్తానన్న జగన్ రెడ్డి ఎందుకు ఆపని చేయలేదు? చని పోయిన సలాం కుటుంబానికి సంతాపం తెలపడం కానీ.. అతని బంధువుల్ని పరామ ర్శించి ధైర్యం చెప్పడం కానీ చేయకుండా.. జగన్ రెడ్డి వారినే తనవద్దకు పిలిపించుకొ ని మొక్కుబడిగా కన్నీళ్లు తుడిచి పంపించేశాడు. ఈ ఒక్క ఘటన చాలు.. జగన్ రెడ్డి కి ముస్లింలపై ఎంత అభిమానముందో చెప్పడానికి.
పేరుకే ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి.. అంజాద్ బాషాకు ఎన్ని అధికారాలిచ్చా డో.. ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో ముఖ్యమంత్రి చెప్పాలి
రంజాన్ తోఫా రద్దుచేసి.. పేద ముస్లింలకు పండుగనాడు సంతోషం లేకుండా చేసిన గన్ రెడ్డి ముస్లింల ద్రోహి కాడా? మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి ఇచ్చానంటున్న జగన్ రెడ్డి.. అంజాద్ బాషాకు ఎలాంటి అధికారాలిచ్చాడో.. ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో సమాధానంచెప్పాలి. అంజాద్ బాషాన బుట్టబొమ్మలా పదవిలో కూర్చోబెట్టి.. పెత్తన మంతా తాడేపల్లి ప్యాలెస్ కే కట్టబెట్టింది నిజం కాదా? ఖబరిస్తాన్.. వక్ఫ్ భూములు అన్యాక్రాంతమవుతుంటే..వైసీపీనేతలే వాటిని కబళిస్తుంటే జగన్ రెడ్డి ఏం చర్యలు తీసుకున్నాడు? క్ఫ్ ఆస్తుల్ని కాపాడుతున్నాడన్న అక్కసుతో నరసరావుపేటలో షేక్ ఇబ్రహీంని వైసీపీనేతలు దారుణంగా కత్తులతో పొడిచి చంపితే, ఆ దారుణంపై జగన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. అబ్దుల్ సత్తార్.. హజీరా.. మిస్బా కుటుంబాల కు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి ఏనాడూ ఎందుకు స్పందించలేదు?
హఫీజ్ ఖాన్ లాంటి వైసీపీ ఎమ్మెల్యేలు వక్ఫ్ ఆస్తులు కాజేస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు శిక్షించడు?
వక్ఫ్ బోర్డు చట్టాలకు తూట్లు పొడుస్తూ.. వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ లాంటి వారు వక్ఫ్ భూములు..ఆస్తులు కాజేస్తుంటే జగన్ రెడ్డి వారిని ఎందుకు శిక్షించడంలేదు? వక్ఫ్ ఆస్తుల్ని కాపాడే చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానన్నహామీ ఏమైందో జగన్ చెప్పాలి. 95శాతం హామీలు అమలు చేశాన ని ప్రగల్భాలు పలుకుతున్న జగన్ రెడ్డి.. పెళ్లికాని ముస్లిం యువతుల్లో ఎంతమందికి లక్షరూపాయలు ఇచ్చాడో చెప్పాలి. పదోతరగతి చదివితేనే దుల్హన్ పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తాననడం ఈ ముఖ్యమంత్రి ఇంగితంలేని తనానికి నిదర్శనం. చంద్రబాబునాయుడి హాయాంలో పెళ్లిరోజునే ముస్లిం యువతులకు ప్రభుత్వం నుంచి రూ.50 వేలు అందేవి.
ఇసుక దోపిడీ కోసం పిచ్చి నిర్ణయాలు అమలుచేసి నిర్మాణ రంగాన్ని దెబ్బతీసి.. చేతివృత్తుల్ని నమ్ముకొని బతికే ముస్లింల పొట్ట కొట్టాడు జగన్ రెడ్డి మైనారిటీ యువత విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి చంద్రబాబు విదేశీవిద్య పథకం అమలు చేశారు. ముస్లిం యువత ప్రభుత్వఉద్యోగాలు..ఇతర కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించడంకోసం చంద్రబాబునాయుడు వారికి ఉచితంగా ప్రభుత్వసొమ్ముతో శిక్షణ ఇప్పించాడు. ముస్లింమైనారిటీల సంక్షేమం.. సంతోషం.. అభివృద్ధికోసం చంద్ర బాబు తీసుకొచ్చిన ప్రతి పథకాన్ని రద్దుచేసిన రద్దుల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. రెక్కాడితే గానీ డొక్కాడని ముస్లింవర్గ కార్మికులు.. చేతివృత్తుల వారి పొట్టకొట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. ఇసుక మాఫియా కోసం నిర్మాణరంగాన్ని దెబ్బతీసిన జగన్ రెడ్డి… ప్రధానంగా ముస్లిం కుటుంబాలనే రోడ్డున పడేశాడు.
అక్రమార్జన కోసం ఇసుక పాలసీ పేరుతో పిచ్చిపిచ్చి నిబంధనలు పెట్టి, ముస్లింల నోటివద్ద కూడు లాగేశాడు. నిరుద్యోగ ముస్లిం యువతకు చంద్రబాబు ఇచ్చిన నిరుద్యోగ భృతిని కూడా జగన్ లేకుండా చేశాడు. పేదల కడుపు నింపే అన్నాక్యాంటీన్లు మూసేసిన జగన్ రెడ్డికి సంక్షేమం పేరెత్తే అర్హత లేదు. చంద్రబాబునాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతా డా.. తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ముస్లిం సమాజం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. మైనారిటీలకోసం టీడీపీప్రభుత్వం ప్రత్యేకంగా అమలుచేసిన 11 పథకాలు రద్దు చేసిన జగన్ రెడ్డి నిర్వాకంతో రాష్ట్రంలోని వేలాది ముస్లిం కుటుంబాలు పూట గడవడం కష్టమై వలసపోతున్నాయి. ఇదీ నాలుగున్నరేళ్లలో జగన్ ముస్లింలకు చేసిన మేలు.” అని రఫీ ఎద్దేవాచేశారు.