రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ఫిర్యాదు
విజయవాడ, మహానాడు: కడప జిల్లాలో 2019 తర్వాత నియమితులైన హోంగార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని టీడీపీ శాసనమండలి సభ్యుడు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు ప్రైవేట్ సెక్యూరిటీగా ఉన్న వారిని, పనిచేసిన వారిని కడప జిల్లాలో హోంగార్డులుగా నియమించారన్నారు. అధికారులను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని, అలాగే ఇతర విషయాలను వైసీపీ నాయకులకు చేరవేసే అవకాశం ఉందని ఆ లేఖలో వివరించారు. వీరిని ఇతర జిల్లాలకు పంపాలని, లేకుంటే ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని కోరారు.