Mahanaadu-Logo-PNG-Large

రవాణా మంత్రి పొన్నం రూ.100 కోట్ల కుంభకోణం

వే బిల్లులు లేకుండా బూడిద అక్రమ రవాణా
రోజుకు 200 నుంచి 300 లారీల తరలింపు
రోజుకు రూ.50 లక్షల పైనే అక్రమ సంపాదన
వెంటనే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలి
హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్‌
తరలుతున్న ఫ్లై యాష్‌ లారీల పట్టివేత

హుజురాబాద్‌: రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ రవాణా సంస్థ అధికారులతో కుమ్మక్కై రోజుకు రూ.50 లక్షలు సంపాదిస్తున్నారని హుజురాబా ద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఆరోపించారు. శనివారం వే బిల్లులు లేకుండా అధిక లోడ్‌ రూల్‌ ప్రకారం 32 టన్నులతో వెళ్లాల్సి ఉండగా 80 టన్నుల లోడ్‌ తో వెళుతున్న ఫ్లై యాష్‌ లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వందల నుంచి మూడు వందల లారీలు రామగుండం ఎన్‌ టీపీసీ నుంచి ఖమ్మం వైపు వే బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. మంత్రి కనుసనల్లోనే ఈ అక్రమ ఫ్లై యాష్‌ రవాణా జరుగుతుంద న్నారు. ఒక్కో లారీలో సుమారు 70 నుంచి 100 టన్నులు కూడా ఉంటుందని తెలిపారు. ఇంత పెద్ద స్కాంను నేరుగా పట్టుకున్నామని చెప్పారు.

ఒక లారీ వెళ్లడానికి సుమారు 25 వేల వరకు ఖర్చు అవుతుందని, అందులో కేవలం 32 టన్నులు వెళ్లడానికి మాత్రమే అనుమతులు ఉంటాయని అన్నారు. అలాంటిది 70 నుంచి 100 టన్నులతో వరకు తీసుకువెళుతున్నారని అన్నారు. అక్రమంగా తరలిస్తున్న దానిపై వచ్చే ఆదాయం ఒక్కో లారీకి రూ.40 వేల వరకు ఉం టుందని వివరించారు. అలా రోజుకు 200 నుంచి 300 లారీలు వెళితే సుమా రు 50 లక్షల వరకు అవుతుందని అన్నారు. మంత్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని, ఇప్పటివరకు రూ.100 కోట్ల స్కామ్‌ చేశారని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పదవి నుంచి భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.