భూ కబ్జా చట్టాన్ని చెత్త బుట్టలో వేయండి

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
త్రిపురాపురం, బాలాజీనగర్‌ తండాలలో ప్రచారం

సత్తెనపల్లి, మహానాడు : నకరికల్లు మండలం త్రిపురాపురం, బాలాజీనగర్‌ తండా గ్రామాలలో శనివారం ఎన్నికల ప్రచారంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో మన భూములపై ఆయన బొమ్మ వేసుకుంటున్నాడని, ఆ తర్వాత భూములను కబ్జా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఆ చట్టాన్ని చెత్త బుట్టలో వేయాలని కోరారు. జగన్‌ విధ్వంస పాలన దెబ్బకు వందల కంపెనీలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి. ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ 30వ స్థానంలో ఉంది.

వ్యవస్థలను కలుషితం చేస్తున్న వైసీపీ రౌడీ సంస్కృతిని తరిమికొట్టే సమయం ఆసన్నమైందన్నారు. దళిత, మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను మోసం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని విమర్శించారు. తిరిగి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.