దేవరంపాడు నుంచి తిరుపతికి పాదయాత్ర

జనసేన పార్టీ నాయకుల మొక్కు 
జెండా ఊపి ప్రారంభించిన కన్నా నాగరాజు

సత్తెనపల్లి, మహానాడు: దేవరంపాడు శ్రీ నేతివెంకన్న స్వామి ఆలయం నుండి తిరుపతికి పాదయాత్రను గుంటూరు మాజీ మేయర్ సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టాలని మొక్కుకున్న జనసేన పార్టీ నాయకులు రాజుపాలెం మండలం దేవరంపాడు శ్రీ నేతి వెంకన్న స్వామి ఆలయం నుండి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాయానికి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తనయులు గుంటూరు మాజీ మేయర్ కన్నా నాగరాజు జండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పాదయాత్రగా తిరుమల తిరుపతి లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ముక్కు చెల్లించుకుని అందరూ క్షేమంగా తిరిగి రావాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, కన్నా లక్ష్మీనారాయణలు అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని ఎన్నికలకు ముందు మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట నరసయ్య తిరపతి వెంకన్న స్వామి వద్ద మొక్కుకున్నారు. అనుకున్నది నెరవేరితే మరల నీ వద్దకు వచ్చి ముక్కు చెల్లించుకుంటానని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వద్ద మొరపెట్టుకున్నారు.

అనుకున్నట్లుగానే అందరూ విజయం సాధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో శనివారం తోట నరసయ్య తో పాటు కేదార్ రమేష్, రుసుం వెంకటేశ్వర్లు, తోట వెంకటేశ్వర్లు, తలారి వెంకటేశ్వర్లు, తోట వెంకటశివరావు, యు హనుమంతరావు, వేపూరి వెంకటేశ్వర్లు తోట పుల్లారావులు మొత్తం తొమ్మిది మంది పాదయాత్రగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లపాటి పెద్దిరాజు, టిడిపి నాయకులు డాక్టర్ వడ్డేంపూడి పవన్ కుమార్, పులిబండ్ల సాంబశివరావు, అంకాల ప్రభుదాసు, కోట జోసఫ్ తదితరులు ఉన్నారు