• పల్నాడు జిల్లాలో గిరిజన మహిళల్ని ట్రాక్టర్లతో తొక్కించి చంపిన వైసీపీ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోలేదో ముఖ్యమంత్రి చెప్పాలి
• మాచర్ల మండలం చెంచు కాలనీలో నీలాబాయ్ పై సామూహిక అత్యాచారంచేసిన నిందితులకు నేటికీ శిక్ష పడలేదు
• గిరిజన యువకుడు నవీన్ పై దాడిచేసి, నోట్లో మూత్రం పోసిన వైసీపీ కార్యకర్తలపై చర్యలు లేవు
• గిరిజనులంటే ఈ ముఖ్యమంత్రికి.. ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో
• అమానుషాలు.. ఆకృత్యాలకు పాల్పడిన జగన్ రెడ్డిని, అతని ప్రభుత్వాన్ని గిరిజనులు చావుదెబ్బ కొట్టాలి
– ఎం.ధారు నాయక్ (టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు)
4 ఏళ్ల 10 నెలల పాలనలో జగన్ రెడ్డి ఒక ఎజెండా ప్రకారం గిరిజనులపై దాడు లు చేయించి, వారి ఆస్తులతో పాటు, వారి అధీనంలోని ప్రకృతివనరుల్ని కొల్లగొట్టాడని, అంతటితో తృప్తిపడక చివరకు గిరిజనుల్ని దారుణంగా చంపించే స్థాయికి వచ్చాడని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ధారునాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.
తన పార్టీ నేతలు..కార్యకర్తలకు జగన్ రెడ్డి ట్రాక్టర్లు ఇచ్చింది..గిరిజన మహిళల్ని తొక్కించి చంపడానికా?
“గుక్కెడు తాగునీరు అడిగిందన్న అక్కసుతో గిరిజన మహిళను పల్నాడు జిల్లా మల్లవరంలో (రెంటచింతల మండలం) వైసీపీ నాయకుడు దారుణంగా ట్రాక్టర్ తో తొక్కించి చంపాడు. అంతకుముందు అదే పల్నాడుజిల్లా నకరికల్లు సమీపంలోని శివాపురం తండాలో మంత్రూ బాయ్ అనే గిరిజనురాలిని బాకీ తీర్చలేదన్న అక్కసుతో వైసీపీనేత శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపాడు. జగన్ రెడ్డి వైసీపీ నేతలు..కార్యకర్తలకు ట్రాక్టర్లు ఇచ్చింది గిరిజన మహిళల్ని తొక్కించి చంపడా నికా?
అంతటి దారుణాలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదో జగన్ గిరిజనులకు సమాధానం చెప్పాలి. మాచర్ల మండలం చెంచు కాలనీలో నీలాబాయ్ అనే గిరిజనమహిళపై సామూహిక అత్యాచారంచేస్తే, నిందితుల్ని ప్రభుత్వం ఇప్పటివరకు శిక్షించలేదు. వైసీపీ కార్యకర్తలు నవీన్ అనే యువకుడిని దారుణంగా కొట్టి, నోటిలో మూత్రం పోసి అమానవీయ ఘటనకు పాల్పడ్డారు.
వైసీపీ శ్రేణులు గిరిజనులపై ఇంతటి దారుణాలకు తెగపడుతున్నా జగన్ రెడ్డి ఏనాడూ వారిని వారించింది లేదు. ఒక్కరినీ శిక్షించింది లేదు. బాధిత కుటుంబాల పక్షాన నిలవాల్సిన పోలీసులు చట్ట విరుద్ధంగా గిరిజనులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు. వైసీపీనేతలు గంజాయిపండిస్తూ.. యథేచ్ఛగా విక్రయాలు జరుపుతుంటే వారిని వదిలేసి, అమాయక గిరిజన యువతని కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారు.
గిరిజనులకు తాగడానికి నీళ్లు లేకపోయినా ముఖ్యమంత్రిలో స్పందన లేదు
గిరిజనులకు గతంలో చంద్రబాబునాయుడు అమలుచేసిన అనేక పథకాల్ని కూడా జగన్ అధికారంలోకి రాగానే రద్దుచేశాడు. ఆఖరికి ఉచిత విద్యుత్ కూడా ఇవ్వకుండా వారినుంచి బలవంతంగా విద్యుత్ బిల్లులు వసూలుచేస్తున్నారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తానని నమ్మబలికి మోసగించాడు.
గిరిజన తండాలు.. పల్లెల్లో తాగడానికి మంచినీళ్లు లేకపోయినా జగన్ రెడ్డి స్పందించడం లేదు. చంద్రబాబు గిరిజన విద్యార్థులకోసం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైల బుల్ స్కూళ్లను జగన్ రద్దుచేశాడు. దాంతో గిరిజన విద్యార్థినీ విద్యార్థులకు నాణ్య మైన విద్య దూరమైంది. గతంలో గిరిజన పాఠశాలల్ని గురుకులాలుగా మారిస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటి నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసింది.
గురు కులాల్లో నియామకాలుచేపట్టకుండా విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడుతోంది. వైసీపీ ప్రభుత్వం గిరిజన గురుకులాలను తూతూమంత్రంగా ఔట్ సోర్సింగ్ సిబ్బందితో నడిపిస్తోంది. 500 జనాభా ఉండే తండాలను చంద్రబాబు గిరిజన గ్రామాలుగా ప్రకటించి, రోడ్లు..తాగునీరు..వీధిలైట్లు..ఆసుపత్రుల వంటివి ఏర్పాటు చేస్తే, జగన్ రెడ్డి హాయాంలో కనీసం వీధిలైట్లు ఏర్పాటుచేయలేని దుస్థితి ఏర్పడింది.
ఉపాధిలేక, కుటుంబపోషణ కోసం… గిరిజనులు పొట్టచేత బట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలసపోయినా, గిరిజన మహిళలు మనసు చంపు కొని వ్యభిచార కూపాల్లోకి దిగుతున్నా ముఖ్యమంత్రి మనసు కరగలేదు.. గిరిజ నులపై కించిత్ జాలి కలగడంలేదు.
పదవుల పిచ్చితో గిరిజన మంత్రులు, ఎమ్మెల్యే లు గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశారు
ఉపముఖ్యమంత్రి రాజన్నదొరకు జగన్ రెడ్డి భజన చేయడం తప్ప, గిరిజనుల సంక్షేమం గురించి ఆలోచించడంలేదు. డబ్బులు తీసుకొని గిరిజనేతరుల్ని గిరిజన పోస్టుల్లో నియమించాడు. శ్రీశైలం ఐటీడీఏలో గిరిజనేతరుడైన వ్యక్తిని లెక్చరర్ గా నియమించాడు. మారుమూల తండాల్లో గిరిజనులకు కల్తీ విత్తనాలు ఇవ్వడంతో వ్యవసాయపరంగా కూడా వారు నష్టపోతున్నారు.
పోడుభూములపై సాగుహక్కులు ఇచ్చే విషయంలో కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం పార్టీల ప్రస్తావన తీసుకొచ్చి, టీడీపీ పక్షాన ఉన్న గిరిజనులకు తీరని అన్యాయం చేసింది. గిరిజన యువతకు జగన్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగమిచ్చింది లేదు. గిరిజనులకు జగన్ రెడ్డి.. వైసీపీప్రభుత్వం మాటల్లో చెప్పలేనంత అన్యాయం చేస్తున్నా.. అధికార యావతో, పదవుల పిచ్చితో గిరిజనమంత్రులు.. ఎమ్మెల్యేలు తమ జాతికి తీవ్ర అన్యాయం చేశారు.
గిరిజనులంతా ఏకమై ఎన్నికల్లో జగన్ రెడ్డిని చావుదెబ్బ కొట్టాలి
గిరిజనుల్ని ఈ విధంగా హింసిస్తూ, వారిని సర్వనాశనం చేసిన ఈ ముఖ్యమంత్రి కి, ఈ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాల్సిన సమయం వచ్చింది. గిరిజనులంతా ఏకమై జగన్ రెడ్డిని చావుదెబ్బ కొట్టడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసే న ప్రభుత్వాన్ని గెలిపించి తిరిగి తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుకోవాలి.” అని ధారునాయక్ పిలుపునిచ్చారు.