పాల్గొన్న వసంత కృష్ణప్రసాద్
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి, మహానాడు: సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధిద్దామని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. కొండపల్లి మున్సిపాలిటీలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అదే ప్రాంగణంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో వసంత కృష్ణప్రసాద్‌తో పాటు జనసేన జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు బొలియాశెట్టి శ్రీకాంత్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.