విజయవాడ, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. బీజేపీ ఎన్నికల సమన్వయకర్త పేరాల శేఖర్ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నా రాయణ, బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ పాతూరి నాగభూషణం, అధికార ప్రతినిధి భాను ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేరాల శేఖర్ జీ మాట్లాడుఃతూ ప్రధాని విశ్వకర్మ యోజన పథకం ద్వారా బీసీల సాధికారత సాధిస్తామని తెలిపారు. వెనుక బడిన వర్గాలకు పూలే చేసిన సేవలు ప్రతి పౌరుడు మరువలేనిదన్నారు. బిట్రా శివన్నారాయణ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి అనుసరణీయమన్నారు.
బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ ప్రతిఒక్కరూ జ్యోతిరావు పూలే అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. జ్యోతిరావు ఫూలే విద్యకు పెద్దపీట వేశారని, కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆలోచనలు అమలు చేయాలన్నారు. కార్యక్రమానికి ఓబీసీ మోర్చా నేత పట్నాయక్ సమన్వయకర్తగా వ్యవహరించగా పార్టీ నాయకులు పాల్గొన్నారు.