దర్శిలో రామోజీరావుకు నివాళి

దర్శి: టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం రామోజీరావు చిత్రపటానికి దర్శి టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, బీజేపీ నాయకులు మాడపాకుల శ్రీను, తిండి నారాయణరెడ్డి పాల్గొన్నారు. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మీడియా రంగంలో ఎన్నో సవాళ్లను అధిగమించి విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతిఒక్కరికీ ఆదర్శనీయమని, మీడియా రంగంలో ఆయన ఒక శిఖరమని పేర్కొన్నారు.