గుంటూరులో రామోజీరావుకు ఘన నివాళి

గుంటూరు: నగరంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా దిగ్గజం రామోజీ రావు చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. తాడికొండ, ప్రత్తిపా డు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్‌, బూర్ల రామాంజ నేయులు, గళ్లా మాధవి, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారని, రాజకీయ, వ్యవసాయ, వ్యాపార రంగాలలో ప్రతిఒక్కరికి దారిచూపిన మార్గదర్శకుడు, దార్శనికుడని కొనియాడారు. రామో జీ ఫిల్మ్‌ సిటీ అనే అద్బుతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారని, ఆయన అకాల మరణం తీరని లోటని సంతాపం తెలిపారు. మరణం లేని ఏకైక వ్యక్తి రామోజీరావు అని నివాళులర్పించారు.