అమరావతి సృష్టికర్త వెంకటాద్రికి ఘన నివాళులు

– పంట పొలాలను పరిశీలించిన అశోక్ జాడౌన్

గుంటూరు, మహానాడు: రెండు రోజులుగా భారీ వరదలు, వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్లో పర్యటన నిమిత్తం ఢిల్లీ నుంచి వచ్చిన అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )జాతీయ అధ్యక్షుడు అశోక్ జాడౌన్ ఆదివారం ఉమ్మడి కృష్ణాజిల్లాలో, సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా అమరావతిని సందర్శించారు. అమరావతిలోని కేంద్ర పురావస్తు శాఖ సంగ్రహాలయాన్ని మహా చైత్యాన్ని, ధ్యాన బుద్ధ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమరావతి జమీందారు కింగ్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గురించి డాక్టర్ జాస్తి వీరాంజనేయులు వివరించారు. అమరావతి సృష్టికర్త విగ్రహానికి ఘన నివాళులర్పించారు.

భవిష్యత్తులో అమరావతి మేటి నగరంగా వెలుగొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవతలు కొలువుండే ఉండే రాజధాని అమరావతిని సందర్శించటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తరువాత అమరావతి పొలాలు వైకుంటాపురం, పెదమద్దూరు పాడైపోయిన పొలాలను పరిశీలించారు. అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) సంయుక్త కార్యదర్శి గోళ్ళ మాల్యాద్రి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.