త్రిపురం: ఈనాడు అధినేత రామోజీరావు మృతి పట్ల త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రామోజీ కుటుంబానికి సాను భూతి తెలిపారు. రామోజీతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. శాసన సభ్యుడి గా ఉన్న సమయంలో తరచూ రామోజీని కలిసేవాడినని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహించిన మలక్పేట, అబ్దుల్లాపూర్ మెట్లో రామోజీ ఫిలిం సిటీని స్థాపించి మలక్పేట అభివృద్ధికి తోడ్పాటుగా నిలిచారని గుర్తుచేశారు. ఒడిదుడు కులను ఎదుర్కొని విజయాన్ని సాధించడం ఆయన నైజమని అన్నారు. భారత దేశ అభివృద్ధిలో ఆయన భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాం తి కలగాలని ఆకాంక్షించారు.