తెలంగాణ ఉద్యమ సారధికి నిజమైన గుర్తింపు

– ప్రొఫెసర్ కోదండరాంకు శుభాకాంక్షలు తెలిపిన రెవెన్యూ ఉద్యోగులు

తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండరాం నిజమైన గుర్తింపును కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి. లచ్చిరెడ్డి, కే.రామకృష్ణ, తెలంగాణ తాసిల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్. రాములు, రమేష్ పాక పేర్కొన్నారు.

ప్రొఫెసర్ కోదండరాం కు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం పట్ల యావత్ రెవెన్యూ ఉద్యోగుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి, మిగతా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కోదండరాం సార్ కు మంత్రి పదవి కూడా ఇచ్చి గౌరవించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు.

విశ్వవిద్యాలయం ఆచార్యులుగా, తెలంగాణ ఉద్యమ రథసారథిగా, తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెచప్పుడైన ప్రొఫెసర్ కోదండరాంకు రాష్ట్రంలోని యువకులు, విద్యార్థులు, మహిళలు, ఇతర అన్ని వర్గాల సామాజిక ,ఆర్థిక, స్థితిగతులు తెలిసిన అపర మేధావిగా ప్రొఫెసర్ కోదండరామని ఈ సందర్భంగా వారు అభివర్ణించారు.