టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి దంపతుల అరెస్ట్‌

-హత్యాయత్నం కేసులో నిందితులుగా గుర్తింపు
-మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసిన అలిపిరి పోలీసులు

తిరుపతి: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మితో పాటు భర్త గిరీష్‌ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 25వ తేదీన తిరుపతి ఎన్జీవో కాలనీలో వెంకటశివారెడ్డి అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది.
అపార్ట్‌మెంట్‌ ముందే బైక్‌తో శివారెడ్డిని అడ్డగించి ఇద్దరు వ్యక్తులు మొద్దు కత్తితో తలపై నరకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీ కెమె రా ఆధారంగా నిందితులను గుర్తించారు. అపార్ట్‌మెంట్‌లో ఎదురెదురు ప్లాట్లలో శివారెడ్డి, శ్రీలక్ష్మీ దంపతులు ఉంటున్నారు. శివారెడ్డితో వారికి గతంలో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తుంది.