అభివృద్ధికి కేరాఫ్‌గా పేటను మారుస్తా…

– ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు

నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా మార్చి చూపించి తీరుతానని ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ప్రధానంగా గత పాలకులు శ్మశాన వాటికల అభివృద్ధినిసైతం గాలికి వదిలేశారని, వాటిని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గతంలో కోడెల శివప్రసాదరావు ఉన్నపుడు ఎంత సుందరంగా ఉండేదో అంతకు మించి శుభ్రంగా తయారు చేసి కోడెలకు అంకితం ఇస్తానన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసింది… సంక్షేమాన్ని నాశనం చేసింది. కానీ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. అన్ని పార్టీల నాయకులు కూడా సహకారం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు.