రాజ్ తరుణ్, లావణ్య కేసులో ట్విస్ట్

హైదరాబాద్, మహానాడు : హీరో రాజ్ తరుణ్ తో పాటు మరికొందరిపై లావణ్య సంచలన ఆరోపణలు చేస్తూ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో సమగ్ర వివరాలు లేవని పోలీసులు తెలిపారు. నాలుగు పేజీల ఫిర్యాదులో తేదీ, సమయం, ప్లేస్.. ఇలాంటి వివరాలేవీ అందులో పేర్కొనలేదు. అంతేకాకుండా లావణ్యకు ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో పోలీసులు లావణ్యకు తను చేసిన ఫిర్యాదుపై ఆధారాలు ఇవ్వమని నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుకు లావణ్య స్పందించలేదు. కాల్స్ చేసినా ఆన్సర్ చేయలేదు. దీంతో తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామని పోలీసులు తెలిపారు.